ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఆయుధం ఓటు హక్కు. కుల, మత, లింగ బేధాలు లేకుండా వయోజనులందరికీ రాజ్యాంగం అందించిన వజ్రాయుధం ఓటు. శారీరక లోపాలు ఓటుహక్కుకు ఆటంకాలు కాకూడదని ఎన్నికల సంఘం వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. అంధుల కోసం ప్రత్యేక వసతులు కల్పిస్తోంది. బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పత్రాన్ని ముద్రించి ఇవ్వడంతోపాటు ఈవీఎంలపైనా వారు సులభంగా ఓటువేసుకునేలా సకల సౌకర్యాలు కల్పిస్తోంది.
మేమూ ఓటేస్తాం..ఎవరీ సాయమూ లేకున్నా!! - బ్యాలెట్
కొత్తగా ఈ ఎన్నికల్లో బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పత్రంతో.. ఎవరిసాయం లేకున్నా మేమూ ఓటేస్తాం అంటూ అంధులు విశ్వాసం వ్యక్తంచేశారు.
మేమూ ఓటేస్తాం..ఎవరీ సాయమూ లేకున్నా!!