పుట్టుకతోనే 80 శాతం అంధత్వం.. మెలనిన్ లోపంతో వచ్చే ఆల్బిజం వ్యాధి చూపునైతే తీసుకుంది. ఆమె ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఏం చేయలేకపోయింది. చదువుల్లో రాణిస్తున్న చిన్నారి...పదోతరగతిలో 9.7 జీపీఏ స్కోరు అవలీలగా సాధించింది.
హరిణి ఈ పేరు గుంటూరు భాష్యం పాఠశాలలో సుపరిచితం. రెండడగుల దూరం వరకే చూడగలిగే ఈ చిన్నారి చదువులో మాత్రం టాపర్. అదే ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. సంగడిగుంటకు చెందిన ప్రభాకరరావు, శిరీషల కుమార్తె హరిణి. ఆల్బిజం వ్యాధితో చూపు కోల్పోయిందన్న వైద్యుల మాట కన్నవారిలో ఆందోళన కలిగించింది. తర్వాత తేరుకొని ఆ లోటు కనిపించకుండా హరిణిని ఆత్మస్థైర్యంతో పెంచారు.
జీవితంలో ఉన్నతస్థానానికి ఎదగాలనే ఆశయానికి... వైద్యుల సలహాలు ఆయువు పోశాయి. టెలిస్కోపు, మ్యాగ్నిఫైయింగ్ పరికరాలనుపయోగించి చదవడం అలవర్చుకుంది. పదోతరగతి పరీక్షల కోసం అహర్నిశలు కష్టపడింది. సహాయకుల అండతో పరీక్షలు రాసి...సాధారణ విద్యార్థులకు పోటీగా నిలిచింది. 3 సబ్జెక్టుల్లో నూటికి నూరు మార్కుల సాధించి 9.7 జీపీఏ స్కోరుతో ఔరా అనిపించింది.
ఆత్మవిశ్వాసమే తనను ముందుకు నడిపిస్తోందని... ఈ విజయం ఆరంభమేనని చెబుతోంది హరిణి.
కంటి చూపు 20 శాతం... మార్కులు 90 శాతం
అంధత్వం..ఆమె ఆత్మవిశ్వాసం ముందు చిన్నబోయింది. పదోతరగతిలో సాధారణ విద్యార్థులకు ఏ మాత్రం తీసిపోకుండా 9.7 జీపీఏ స్కోరుతో సాధించి ఔరా అనిపించింది..గుంటూరుకు చెందిన హరిణి. 80 శాతం కంటిచూపు పనిచేయకున్నా..సాంకేతిక పరికరాల సాయంతో చదువులో రాణిస్తోంది.
కంటి చూపు 20 శాతం... మార్కులు 90 శాతం
ఇవీ చదవండి..మనసుకు ఉల్లాసం ..భావి తరాలకు ఆదర్శం
Last Updated : May 28, 2019, 3:12 PM IST