గుంటూరులోని హిందూ కళాశాల వద్దగల జగ్జీవన్ రాం విగ్రహానికి పూలమాల వేసి ఆయనను స్మరించుకున్నారు. కలెక్టర్ శశిధర్ మాట్లాడుతూ జగ్జీవన్ రాం...తన జీవితాంతం దళితుల హక్కుల కోసం పోరాడారన్నారు. కార్మికశాఖ మంత్రిగా, ఉపప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ చిరస్మరణీయమని కొనియాడారు. జగ్జీవన్ రాం ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ కోరారు.
జగ్జీవన్‌రాం ఆశయాల సాధన మన బాధ్యత: కోన శశిధర్
స్వతంత్ర భారతావనికి మొట్టమెుదటి కార్మిక శాఖామాత్యులు, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రాం 112వ జయంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ రాజశేఖర్ బాబు...నివాళులు అర్పించారు.
కలెక్టర్ కోన శశిధర్
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప వ్యక్తి జగ్జీవన్ రాం అని గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్ బాబు వెల్లడించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున రాజకీయ నేతలు ప్రచార ప్రసంగాలు చేయకుండా జగ్జీవన్ రాంకు నివాళులు అర్పించవచ్చని తెలిపారు.
ఇవీ చూడండి :ప్రచారంలో ఆకట్టుకున్న బాలయ్య.. స్టెప్పులేసి సందడి