ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

బెట్టింగ్ వ్యవహారం...ఆసుపత్రిపై అగంతకులు దాడి - narsaraopet

వైద్యులపై దాడులకు నిరసనగా దేశవ్యాప్త బంద్ జరిగిన మరుసటి రోజే..మరో ఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిపై అగంతకులు దాడి చేశారు. ముఖానికి ముసుగులు వేసుకొని ఆసుపత్రిలో ప్రవేశించిన వ్యక్తులు వైద్యుడిపై దాడి చేశారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.

బెట్టింగ్ వ్యవహారం...ఆసుపత్రిపై అగంతులు దాడి

By

Published : Jun 18, 2019, 8:41 PM IST

Updated : Jun 18, 2019, 8:48 PM IST

బెట్టింగ్ వ్యవహారం...ఆసుపత్రిపై అగంతకులు దాడి

గుంటూరు జిల్లా నరసరావుపేటలోని శ్రీ కార్తిక్ ఆసుపత్రిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడటం కలకలం సృష్టించింది. స్థానిక ఎమ్మెల్యే ప్రొద్భలంతో.. ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారని ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ రమ్య ఆరోపించారు. ఇవాళ మధ్యాహ్న సమయంలో కొందరు దుండగులు ముసుగులు వేసుకొని ఆసుపత్రిలోకి ప్రవేశించి ఆసుపత్రి ఫర్నీచర్...ఇతర వస్తువులు ధ్వంసం చేశారు. నిఘా కెమెరాల్లో దృశ్యాలు రికార్డు అవుతున్నాయని గమనించి వాటిని పగులగొట్టారు. రమ్య తండ్రి శ్రీమన్నారాయణ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్​లో ఓడిపోయారు. వాటికి సంబంధిత లావాదేవీల కారణంగానే ఈ దాడి జరిగిందని ఆసుపత్రి నిర్వాహకులు అంటున్నారు.

బెట్టింగ్ వ్యవహరంపై నరసరావుపేట 1వ పట్టణ పోలీసు స్టేషన్​లో పంచాయతీ జరిగిందని శ్రీమన్నారాయణ కుమార్తె రమ్య తెలిపారు. డబ్బులు లేవని చెప్పటం వలనే ఆసుపత్రిపై దాడి చేశారంటున్నారు. ఈ దాడిలో రమ్య భర్త డాక్టర్ అశ్వనీకాంత్​ గాయపడ్డారు. ఆసుపత్రిపై అగంతకులు ఒక్కసారిగా దాడి చేయడం వలన రోగులు, వారి బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఎమ్మెల్యే అండతోనే ఈ దాడి జరిగిందని బాధితురాలు ఆరోపిస్తున్నారు. దుండగులు ఆసుపత్రిలోకి ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఇదీ చదవండి :'టిక్​టాక్'​ చేస్తూ వెన్ను విరగ్గొట్టుకొన్న యువకుడు

Last Updated : Jun 18, 2019, 8:48 PM IST

ABOUT THE AUTHOR

...view details