డేటా చోరీకేసులో తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందందర్యాప్తు కొనసాగిస్తోంది. డేటా గ్రిడ్స్ సంస్థసీఈఓ అశోక్ ఇవాళ విచారణకు హాజరు కావాలని రెండు రోజుల క్రితమే సిట్ నోటీసులు జారీ చేసింది. అశోక్‌ను విచారణ చేసేందుకు ఉదయం నుంచి పోలీసు ఉన్నఅధికారులు సిద్ధంగా ఉన్నారు. స్టీఫెన్ రవీంద్ర, రోహిణి ప్రియదర్శిని, శ్వేతా రెడ్డి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. ఏపీ, తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారాన్నిఐటీ గ్రిడ్స్ సంస్థ చోరీచేసినట్లు తెలంగాణ పోలీసులు చెబుతున్నారు.కంప్యూటర్లలో కొంత డేటాను తొలగించినట్లు గుర్తించామన్నారు. సమాచారం ఎక్కడి నుంచి తీసుకున్నారనేది అశోక్ వెల్లడిస్తేనే కేసులో పురోగతి లభిస్తుందని చెబుతున్నారు.
అశోక్ హాజరవుతారా? లేదా? - sit investigation
డేటా చోరీ కేసులో పురోగతి కరువైంది. ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈఓ అశోక్.. తెలంగాణ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట ఈరోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటివరకూ ఆయన అధికారుల ముందుకు రాలేదు. అతని ఆచూకీపై తెలంగాణ పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు. ఉదయం నుంచి దర్యాప్తు అధికారులు అశోక్ విచారణకు వస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. ఆయన సమాధానం చెబితేనే దర్యాప్తు ముందుకు కదిలే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అశోక్ హాజరవుతారా? లేదా?