ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

అపోలోలో అరుదైన శస్త్ర చికిత్స

విశాఖ అపోలో ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. 69 ఏళ్ల వ్యక్తికి... గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.

By

Published : Jul 2, 2019, 9:40 PM IST

అపోలో వైద్యుల అరుదైన శస్త్రచికిత్స

అపోలో వైద్యుల అరుదైన శస్త్రచికిత్స

విశాఖ అపోలో వైద్యులు అరుదైన గుండె చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ట్రాన్స్ కేథటర్ అర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ (టవీ)గా పిలిచే చికిత్సను 69 ఏళ్ల వ్యక్తికి అందించి తెలుగు రాష్ట్రాల్లో అరుదైన ఘనతను సాధించారు. ఈ చికిత్సతో బెలూన్ మౌంటెడ్ స్టెంట్ వాల్వ్​ను... చెడిపోయిన అయార్టిక్ వాల్వ్ అనే కవాటము స్థానంలో అమర్చారు. అయార్టిక్ వాల్వ్ అనే కవాటము గుండె నుంచి మొదలై మహాధమని ద్వారం వద్ద ఉండి... మంచి రక్త ప్రసరణను ఒకే మార్గంలో జరిగేట్లుగా నియంత్రిస్తుంది. ఈ పద్ధతిలో తొడభాగము నుంచి చిన్న రంధ్రం చేసి గుండె వరకూ గైడ్ వైర్ సాయంతో బెలూన్ మౌంటెడ్ స్టెంట్ వాల్వ్ పంపించి అమర్చినట్లు కార్డియాలజిస్ట్ డాక్టర్ పాణిగ్రహి తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details