ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

నేరస్తులు, రౌడీల గుండెల్లో నిద్రపోతా.. జాగ్రత్త! - అనంతపురం

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా... అనంతపురంలో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేశారు. జిల్లాను ఉద్యాన పంటల కేంద్రంగా మారుస్తానన్న సీఎం... యువతకు బంగారు భవిష్యత్ కల్పించే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. రాయలసీమను రతనాల సీమగా తయారుచేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.

అనంతపురంలో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం

By

Published : Mar 27, 2019, 10:32 PM IST

Updated : Mar 27, 2019, 11:51 PM IST

అనంతపురంలో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం
మోదీ, కేసీఆర్, జగన్ కలిసి కుట్రలు చేస్తున్నారనిఅనంతపురంలో సీఎం చంద్రబాబు ఆరోపించారు. తెలంగాణలో తెదేపా40 ఏళ్ల నుంచి ఉందని.. తాను ప్రచారానికి వెళ్లితే ఆంధ్రా పెత్తనం ఏంటని ప్రశ్నించడం విడ్డూరమని గుర్తు చేసుకున్నారు.ప్రత్యేకహోదాకు మద్దతు ఇస్తానని కేసీఆర్ ఎక్కడ చెప్పాడని వైకాపా అధినేతజగన్​ను చంద్రబాబు ప్రశ్నించారు.వైకాపా అభ్యర్థులను కేసీఆరే ఖరారు చేశారని దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని సోనియాగాంధీ చెబితే... కేసీఆర్ విమర్శించలేదా? అని నిలదీశారు. మోదీ దేశానికి కాపలా కాదు... దొంగలకు కాపలాదారుడు అని విమర్శించారు. పోలవరం ఆపాలని మళ్లీ సుప్రీంకోర్టును తెలంగాణ ఆశ్రయించిందన్నారు. శ్రీశైలం, సాగర్‌, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రిపైనా కేసీఆర్‌ వివాదాలు రేపుతున్నారని ధ్వజమెత్తారు. కులమతాలు చూసి సంక్షేమ పథకాలు, పొలాలకు నీళ్లు ఇవ్వలేదన్న ఆయన...రాష్ట్రంలో నదులను అనుసంధానం చేస్తున్నామని అన్నారు.

అనంతపురం జిల్లాను ఉద్యాన పంటల కేంద్రంగా మారుస్తానన్న సీఎం...యువతకు బంగారు భవిష్యత్ కల్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. వివేకా హత్యపై సిట్ విచారణకు ఆదేశిస్తే జగన్ ఎందుకు ఒప్పుకోలేదని ప్రశ్నించారు. పెళ్లికానుక ఆర్థికసాయాన్ని రూ.లక్షకు పెంచుతామన్న చంద్రబాబు.... ఏప్రిల్‌ 1 నుంచి ఎన్టీఆర్ వైద్యసేవ కింద రూ.5 లక్షలు, చంద్రన్న భీమా కింద రూ.5 లక్షలు ఇస్తున్నామని అన్నారు. దిల్లీలో అవార్డులు ఇచ్చి.... ఇక్కడకొచ్చి తిడతారని అన్నారు.నేరస్థులు, రౌడీల గుండెల్లో నిద్రపోతానన్నారు.

తాను ఒక్కటికాదు.. 20 హైదరాబాద్‌లు తయారుచేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. అనంతపురం ఎప్పుడూ ఆనందపురంగా ఉండాలన్నారు. మన వద్ద శాస్త్రవేత్తలు ఉన్నారనీ.. వాళ్లను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు ఉంటాయనీ చెప్పారు. అంతా చేయిచేయి కలిపితే ఏపీ నెంబర్‌వన్‌ అవుతుందని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో ప్రతి ఎకరాకు నీరు ఇచ్చి రైతుల కష్టాలు తీర్చుతానన్నారు. కరవుసీమకు కియా మోటార్స్‌ తీసుకువచ్చిన ఘనత తమదేనన్నారు. కోడి కత్తి పార్టీ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఎద్దేవా చేశారు. జాబు రావాలంటే మళ్లీ మళ్లీ బాబే రావాలని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:వైకాపాకు పడే ఓట్లన్నీ... భాజపాకు వేసినట్లే!

Last Updated : Mar 27, 2019, 11:51 PM IST

ABOUT THE AUTHOR

...view details