ప్రతిపక్షంలో ఉన్నా...సమస్యలపై పోరాడుతూ ప్రజలకు అండగా ఉంటామని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట సూర్యనారాయణ చెప్పారు. అనంతపురం జిల్లా లక్ష్మి చెన్నకేశవపురంలో ఏర్పాటు చేసిన తెదేపా కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఆయన కార్యకర్తలకు అండగా నిలుస్తామన్నారు. ప్రజాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టే చర్యలకు సహకరిస్తామన్న ఆయన...అవినీతి జరిగితే మాత్రం నిలదీస్తామని స్పష్టం చేశారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తామని సూర్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.
అధైర్య పడొద్దు... అండగా ఉంటా: సూర్యనారాయణ - తెదేపా కార్యకర్తలు
మరో వందేళ్ల వరకూ తెదేపా ఉంటుందని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ అభిప్రాయపడ్డారు. తెదేపా కార్యకర్తల సమీక్షా సమావేశానికి హాజరైన ఆయన...కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. అభివృద్ధి జరిగితే స్వాగతిస్తామన్న సూర్యనారాయణ...అవినీతి జరిగితే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తామన్నారు.
విలేకరులతో మాట్లాడుతున్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ