ఓట్ల లెక్కింపు మహాఘట్టానికి ఇంకా కొన్ని గంటల సమయమే ఉంది. సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న ఫలితాలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 171 లెక్కింపు కేంద్రాల వద్ద 25 వేల మంది పోలీసులను సిద్ధంగా ఉంచినట్లు డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రతతోపాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు. ఎటువంటి అసాంఘిక చర్యలు జరగకుండా...ముందస్తు జాగ్రత్తగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. నేరచరిత్ర ఉన్న వారిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్న డీజీపీ ఆర్పీ ఠాకూర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
కౌంటింగ్‌కు 25 వేల మంది పోలీసులతో భద్రత - rp thakur
రాష్ట్రంలోని 171 లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని డీజీపీ ఆర్పీ ఠాకూర్ అన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు రాష్ట్రవ్యాప్తంగా 25 వేల మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. లెక్కింపునకు రాజకీయ నాయకులు సహకరించాలని కోరారు.
'కౌంటింగ్ కోసం 25 వేల మంది పోలీసులతో భద్రత'