ప్రధాని వ్యాఖ్యలు.. కోడ్ ఉల్లంఘనే: చంద్రబాబు
పశ్చిమ బంగాలో తృణమూల్ కాంగ్రెస్ శాసనసభ్యులు తమతో టచ్లో ఉన్నారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తీవ్రంగా స్పందించారు. నరేంద్రమోదీ.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ట్వీట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారన్న మోదీ మాటలు... ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని తేల్చి చెప్పారు. మోదీ వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం... సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోని అన్ని వ్యవస్థలనూ మోదీ నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు... ఇప్పుడు ప్రజాస్వామ్యాన్నీ నాశనం చేసేందుకు మోదీ సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు.