'తప్పుడు కేసులు పెడితే ఖబడ్దార్' - babu on jagan
హైదరాబాద్‌లో తెదేపా పార్టీ డేటా అంతా అప్‌డేట్ చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. వైకాపా... కేసీఆర్‌తో కుమ్ముకై తెదేపాను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏపీ డేటాను తాము కాపాడుకుంటామని సీఎం స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో తెదేపా పార్టీ డేటా అంతా అప్‌డేట్ చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు.వైకాపా...కేసీఆర్‌తో కుమ్ముకై తెదేపాను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.ఏపీ డేటాను తాము కాపాడుకుంటామని సీఎం స్పష్టం చేశారు.కేసీఆర్ ఓ నియంత అనుకుంటున్నారని అన్నారు.తెలుగువారికి ఎక్కడ అన్యాయం జరిగినా..తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు.డేటా తమ వ్యక్తిగత ఆస్తి అని...ఏపీ డేటాపై కేసులు పెట్టేందుకు తెలంగాణ పోలీసులు ఎవరని ప్రశ్నించారు.ఏపీ అభివృద్ధికి అడ్డుపడితే వొదిలిపెట్టే సమస్యే లేదని హెచ్చరించారు.తప్పుడు కేసులు పెడితే ఖబడ్దార్ అని వ్యాఖ్యానించారు.ఐటీ దాడులకు తాము భయపడే ప్రసక్తే లేదని … జగన్ అధికారంలోకి వస్తే నీళ్లు దక్కే పరిస్థితి లేదని పేర్కొన్నారు.అందుకే జగన్ దొడ్డిదారిన ప్రయత్నాలు మొదలుపెట్టారని వివర్శించారు.ఓట్ల తొలగింపు విషయమై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు.మోదీ-కేసీఆర్-జగన్ ముగ్గురు కలిసినా ఏమీ జరగదని ధీమా వ్యక్తం చేశారు.