ముందుచూపులేని గత ప్రభుత్వం నిర్వాకంతోనే రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ విత్తనాల కొరత ఏర్పడిందని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ఆరోపించారు. నవంబర్ నుంచి విత్తనాల సేకరణ ప్రక్రియ ప్రారంభిస్తేగాని సకాలంలో రైతులకు అందించలేమన్నారు. విత్తన కంపెనీలకు చెల్లించాల్సిన నిధులు దారి మళ్లించడం వలనే ఆయిల్ ఫెడ్, ఏపీ సీడ్స్ విత్తనాలు సేకరించలేదన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు నాణ్యమైన విత్తనాలు సేకరించి రైతులకు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు మంత్రి చెప్పారు. ఇప్పటికే 2లక్షల 83వేల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మిగిలిన రైతులకు సైతం త్వరలోనే విత్తనాలు అందిస్తామన్నారు. రబీలో రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి ఇంకా వెయ్యి కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. మరో వారం రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వం నిర్వాకంతోనే విత్తన కొరత: కన్నబాబు
గత ప్రభుత్వం నిర్వాకంతోనే రాయలసీమలో విత్తన కొరత ఏర్పడిందని వ్యవసాయ మంత్రి కన్నబాబు అన్నారు. విత్తన కంపెనీలకు చెల్లించాల్సిన నిధులు పక్కదారి పట్టడం వలనే ఈ సమస్య వచ్చిందన్నారు. వారం రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
గత ప్రభుత్వం నిర్వహణ లోపంతోనే విత్తన కొరత : మంత్రి కన్నబాబు
Last Updated : Jun 26, 2019, 5:21 PM IST