ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

విత్తన కొరతకు గత ప్రభుత్వమే కారణం: మంత్రి కన్నబాబు - కురసాల కన్నబాబు

విత్తన సరఫరాపై ప్రతిపక్షం చేస్తోన్న విమర్శలు సరికావని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. విత్తన కొరతకు గత ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.

విత్తన కొరతకు గత ప్రభుత్వమే కారణం : మంత్రి కన్నబాబు

By

Published : Jul 2, 2019, 5:52 PM IST

Updated : Jul 2, 2019, 6:57 PM IST

విత్తన కొరతకు గత ప్రభుత్వమే కారణం : మంత్రి కన్నబాబు

గత ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు. విత్తన కొరతపై గతంలో అధికారులు ఎన్నిమార్లు నివేదించినా పట్టించుకోలేదన్నారు. 50 సార్లు మార్క్​ఫెడ్, వితనాభివృద్ధి సంస్థలు లేఖలు రాశారని, ఫిబ్రవరి 19న అప్పటి వ్యవసాయ శాఖ కార్యదర్శి నోటు పంపారన్నారు. నవంబర్ నుంచి సేకరించి మే లో రైతులకు విత్తనాలు పంపిణీ చేయాల్సి ఉండగా...గత ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికే చేపట్టలేదన్నారు.

గత ప్రభుత్వ వైఫల్యమే

ఏపీ సీడ్స్, మార్క్​ఫెడ్​కు బిల్లులు చెల్లించకుండా రూ. 380 కోట్లు దారిమళ్లించారని ఆరోపించారు. అధికారులు గత ప్రభుత్వానికి 28 సార్లు లేఖలు రాశారని, బిల్లులపై రూ.108 కోట్లు చెల్లిస్తే విత్తనాలు కొనుగోలు చేయవచ్చని అప్పటి వ్యవసాయ శాఖ కార్యదర్శి లేఖ రాశారని గుర్తుచేశారు. జూన్ 8 వరకు ముఖ్యమంత్రిని తానే అని చెప్పిన చంద్రబాబు..విత్తనాల పంపిణీ విషయం విస్మరించారని ప్రశ్నించారు. వేరుశనగ విత్తనాలు మాత్రమే కొరత ఏర్పడిందని, తమ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే నాటికి 50 వేల క్వింటాళ్లు మాత్రమే విత్తన నిల్వలు ఉన్నాయని కన్నబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతానికి 3 లక్షల 8 వేల క్వింటాళ్లు విత్తనాలు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు.

ఇతర రాష్ట్రాల నుంచి సేకరణ

రాష్ట్రంలో 4.41 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాల డిమాండు ఉందని, అధికధరకైన సరే నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసి రైతులకు అందిస్తామన్నారు. కర్ణాటక, తెలంగాణ, బరోడా నుంచి విత్తనాలు సేకరణ చేస్తుమన్నారు. విత్తన కొరతపై పూర్తి బాధ్యత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 2.8 లక్షల క్వింటాళ్ల విత్తనాల సరఫరా అయ్యిందని, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో 70 వేల క్వింటాళ్ల వరకు పంపిణీ జరిగిందన్నారు.

కొబ్బరి రైతులను ఆదుకుంటాం

కొబ్బరి రైతులను ఆదుకునేందుకు 5 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. నాఫెడ్, ఆయిల్ ఫెడ్ సంస్థలు కొబ్బరి కొనుగోలుకు ముందుకు వచ్చాయని కన్నబాబు తెలిపారు. తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల కొబ్బరి రైతులను ఆదుకుంటామన్నారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో కొన్ని చోట్ల రైతు ఆత్మహత్యలు జరిగాయన్న మంత్రి....బ్యాంకులతో మాట్లాడుతున్నామన్నారు. రైతులపై ఒత్తిడి తేవొద్దని బ్యాంకులకు సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు.

ఇదీ చదవండి :'వైకాపాకు సంక్షేమం కాదు.. కక్ష సాధింపే ముఖ్యం'

Last Updated : Jul 2, 2019, 6:57 PM IST

ABOUT THE AUTHOR

...view details