అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణం చెల్లింపులు చేయాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. మే 23 తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయినా అగ్రి బాధితులను ఆదుకోవాలని కోరారు. బాధితులకు రూ. 3 వేల 965 కోట్లు పరిహారం చెల్లించాలన్నారు. గుంటూరులో సమావేశమైన అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర కమిటీ తమ సమస్యలపై ముఖ్యమంత్రికి మరోసారి లేఖ రాయాలని నిర్ణయించింది.
'అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోండి' - state committee
అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం వెంటనే చెల్లింపులు చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి డిమాండ్ చేశారు. ఈ విషయమై ముఖ్యమంత్రికి లేఖ రాస్తామని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం తెలిపింది.
అగ్రిగోల్డ్ బాధితుల సంఘం
హాయ్ ల్యాండ్ భూములను కోర్టు పరిధిలోనే విక్రయించాలని డిమాండ్ చేసింది. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గత ఎన్నికల్లో పార్టీల కతీతంగా వ్యవహరించిందని...బాధితులకు డబ్బులు ఇప్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని ఆ సంఘం గౌరవాధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు.