ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఆధార్​తో పాన్​ అనుసంధానం తప్పనిసరి: సుప్రీం

ఆదాయపు పన్ను సేవల కోసం పాన్​ కార్డుతో ఆధార్​ను తప్పనిసరిగా అనుసంధానం చేయాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

By

Published : Feb 7, 2019, 8:56 AM IST

పాన్​ కార్డుతో ఆధార్​ను తప్పనిసరిగా అనుసంధానం చేయాలని సుప్రీం కోర్టు తీర్పు

పాన్​ కార్డుతో ఆధార్​ను తప్పనిసరిగా అనుసంధానం చేయాలని సుప్రీం కోర్టు తీర్పు
ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేసేందుకు పాన్​ కార్డుతో ఆధార్​ అనుసంధానం తప్పనిసరి అని సుప్రీం కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ఆదాయపు పన్ను చట్టంలో 139ఏఏ సెక్షన్​ ప్రకారం అనుసంధానం చేయాల్సిందేనని స్పష్టం చేసింది.

2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆధార్​తో పాన్​ అనుసంధానం లేకున్నా శ్రేయ సేన్, జయశ్రీ సత్పటెకు పన్ను చెల్లించేందుకు దిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేంద్రం చేసిన అప్పీలుపై అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. వచ్చే ఏడాదిలోనూ పన్ను చెల్లింపులు తీర్పు సూచించిన విధంగానే జరగాలని కోర్టు నొక్కి చెప్పింది.

రాజ్యాంగ పరంగా ఆధార్​ చట్టబద్ధమైనదే అయినా బ్యాంకు ఖాతాలు, చరవాణి, పాఠశాలల్లో తప్పనిసరి కాదని గతేడాది సెప్టెంబర్​ 26న ఐదుగురు సభ్యుల ధర్మాసనం తెలిపింది. ఐతే ఆదాయపు పన్ను విషయంలో మాత్రం తప్పనిసరి అని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details