ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

30లక్షలకు పైగా విదేశీ కరెన్సీ పట్టివేత - AIRPORT

ఎవరికీ తెలియకుండా విదేశీ కరెన్సీని దేశం దాటించాలనుకున్నాడు. గుట్టుచప్పుడు కాకుండా బ్యాగులో సర్దుకొని ఎయిర్ పోర్టుకు వెళ్లాడు. తనిఖీల్లో దొరికిపోయి బిక్కమొహం వేశాడు.

cash

By

Published : May 7, 2019, 4:00 PM IST

30లక్షలకు పైగా విదేశీ కరెన్సీ పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారులు విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి ఎమిరెట్స్ (ఈకె 529) విమానంలో దుబాయ్ వెళ్ళేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన దామస్ బెన్నీ అనే ప్రయాణికుడి బ్యాగులో తనిఖీలు చేపట్టగా... 30 లక్షల 35 వేల 422 రూపాయల విదేశీ నగదు దొరికింది. అనంతరం నగదు స్వాధీనం చేసుకొని నిందితుడిని సంబంధిత అధికారులకు అప్పగించారు. దామస్ బెన్నీ పాస్​పోర్టు ఆధారంగా నిందితుడు స్వదేశీయుడిగా గుర్తించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details