ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

పదో తరగతి పరీక్షల ఏర్పాట్లు పూర్తి

పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పరీక్షలు రాసుకునేలా ప్రశాంత వాతావరణం కల్పిస్తున్నాం. పరీక్షల నిర్వహణపై సందేహాలు తీర్చుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్​కు ఫోన్ చేయవచ్చు - ఏ.సుబ్బారెడ్డి, పరీక్షల సంచాలకులు

ఏ.సుబ్బారెడ్డి

By

Published : Mar 15, 2019, 11:37 PM IST

ఏ.సుబ్బారెడ్డి
ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 3 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 839 పరీక్షా కేంద్రాలనుఏర్పాటు చేసి.. 290 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు.6 లక్షల 21వేల 634 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వారిలో బాలురు 3 లక్షల 18 వేల 524, బాలికలు 3లక్షల 3వేల 110 మంది ఉన్నారు. పరీక్ష సమయంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు.

విద్యార్థులు స్కూల్ యూనిఫార్మ్ వేసుకుని రావద్దనిపరీక్షల సంచాలకులు సుబ్బారెడ్డి సూచించారు. మార్చి 22న జరిగే పరీక్షను ఏప్రిల్ 3కు మార్చినట్లు ప్రకటించారు. బుద్ధిమాంద్యం, మానసిక వైకల్యం ఉన్న విద్యార్థులకు పాస్ మార్కులను 10గా నిర్ణయించినట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని సుబ్బారెడ్డి సూచించారు. విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా వెళ్లవచ్చన్నారు. ఎమైనా సందేహాలు ఉంటే 1800-5994550 టోల్ ఫ్రీ నెంబర్​కు ఫోన్ చేయవచ్చని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details