ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / breaking-news

లైవ్ అప్​డేట్స్​ : బడ్జెట్​ 2019 - interim budget

budget 2019

By

Published : Feb 1, 2019, 11:39 AM IST

Updated : Feb 1, 2019, 3:43 PM IST

2019-02-01 13:59:28

update8- ద్రవ్యోల్బణంపై పీయూష్

ఎన్నికల ఆర్థికం

"2009-14లో ద్రవ్యోల్బణం 10.1శాతం. భాజపా హయాంలో ద్రవ్యోల్బణం శాతం చాలా తగ్గింది. 2018-19లో ద్రవ్యలోటు 3.4శాతం" 
                ---పీయూష్ గోయల్​​
 

2019-02-01 14:47:45

update10- రైతులపై వరాల జల్లు

ఎన్నికల పద్దు వ్యవసాయం

"చిన్న, సన్నకారు రైతులకు మద్దతునివ్వడానికే కిసాన్​ సమ్మాన్​ నిధి. ప్రతీ రైతుకు మూడు దఫాలుగా 6వేల రూపాయిలు మంజూరు. ఇది రెండెకరాల కన్నా తక్కువ భూమి ఉన్న రైతులకు వర్తిస్తుంది. "

---- పీయూష్​ గోయల్‌
 

2019-02-01 14:48:51

update11-విద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలకు భారీ నిధులు

ఎన్నికల పద్దు వైద్యంపై

"విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాలకు భారీగా నిధులు కేటాయించాం. ప్రధానమంత్రి సడక్‌ యోజనకు రూ.19 వేల కోట్లు కేటాయించాం. ఆయుష్మాన్‌ భారత్​తో 50 కోట్ల పేదలకు ఉచిత వైద్యం అందుతుంది. కొత్తగా ఎన్నో రాష్ట్రాలకు ఎయిమ్స్‌లు మంజూరు చేశాం"

2019-02-01 14:56:44

update17-జీఎస్టీ

టాక్స్​ పద్దు

"సినిమా థియేటర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు. ఇళ్ల కొనుగోలుదారులకు జీఎస్టీ మినహాయింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటాము. మంత్రివర్గ ఉపసంఘం నివేదికను జీఎస్టీ మండలి ముందు ప్రవేశపెట్టి తుది నిర్ణయం తీసుకుంటాం."
                        ---- పీయూష్​ గోయల్‌

 

2019-02-01 15:00:23

update22- 'ఓటాన్‌ అకౌంట్‌ కాదు.. అకౌంట్‌ ఫర్‌ ఓట్స్‌’ - బడ్జెట్‌పై చిదంబరం విమర్శలు

ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం స్పందించారు. ఇది ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ లాగా లేదని, అకౌంట్‌ ఫర్‌ ఓట్స్ (ఓట్ల కోసం)‌లా ఉందని అన్నారు. అలాగే ఆయన గోయల్‌కు ధన్యవాదాలు తెలిపారు. దేశ వనరులు తొలుత పొందాల్సిన హక్కు పేదలది అని కాంగ్రెస్‌ చేసిన ప్రకటనను కాపీ చేసింనందుకు ధన్యవాదాలు అంటూ చిదంబరం ట్వీట్‌ చేశారు.

పీయూష్‌ గోయల్‌ ఈరోజు ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో రైతులకు, మధ్యతరగతి వారికి లభ్యం చేకూర్చేలా పథకాలు ప్రవేశపెట్టారు. అయిదు ఎకరాల లోపు ఉన్న రైతులకు ఏడాదికి రూ.6వేలు అందించడం, వ్యక్తిగత పన్ను మినహాయింపును రూ.5లక్షలకు పెంచడం, గ్రాట్యుటీ పరిమితిని రూ.20 లక్షలకు పెంచడంతో పాటు 60ఏళ్లు నిండిన వారికి ప్రతి నెలా రూ.3వేల పింఛన్‌ వచ్చే విధంగా పథకాన్ని ప్రవేశపెట్టారు. రక్షణ రంగానికి రూ.3లక్షల కోట్లు కేటాయించారు. మధ్యంతర బడ్జెట్‌ అయినప్పటికీ పథకాలు, కేటాయింపులు ఎక్కువగా ఉండడంతో చిదంబరం ఇది ఓట్ల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంటూ విమర్శించారు.

2019-02-01 14:54:04

update14-రైల్వేకు 64,587 కోట్లు

రైల్వేకు బడ్జెటరీ సపోర్టుకు రూ.64,587 కోట్లు మంజూరు. మిజోరాం, మేఘాలయా రాష్ట్రాలను రైల్వేతో అనుసంధానం చేశాం
 

2019-02-01 14:54:32

update15- లక్ష డిజిటల్​ గ్రామాలే లక్ష్యం

"దేశంలో 268 వరకు మొబైల్‌ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వచ్చే ఐదేళ్లలో లక్ష డిజిటల్‌ గ్రామాల ఏర్పాటే మా లక్ష్యం. ఈశాన్య భారతానికీ మౌలికరంగ అభివృద్ధి ఫలితాలు అందిస్తున్నాం. ఐదేళ్లలో సౌరవిద్యుత్‌ ఉత్పత్తి 10 రెట్లు ఎక్కువ పెంచాం."
 

2019-02-01 14:55:11

update16- ఐటీ రిటర్నులు...

"ప్రస్తుతం నెలకు రూ.97,100 కోట్లు పన్ను వసూళ్లవుతున్నాయి. గడచిన ఐదేళ్లలో రాష్ట్రాల పన్ను వసూళ్లు సాలీనా 14 శాతం మేర పెరిగాయి. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలతో రూ.లక్ష కోట్లకు పైగా కొత్తగా లెక్కల్లోకి వచ్చాయి. 2017-18లో కోటి 6 లక్షల మంది ఐటీ రిటర్న్‌లు దాఖలు చేశారు."
---పీయూష్​గోయల్​

 

2019-02-01 14:57:13

update18- ఆదాయపు పన్ను

ఎన్నికల ఆర్థికం

వేతన జీవులు, పింఛన్‌దారులకు కేంద్రం ఊరటనిచ్చింది. ఆదాయపన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంచుతున్నట్టు పీయూష్​ గోయల్​ ప్రకటించారు. రూ.5 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను లేదని స్పష్టం చేశారు. స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిమితి రూ.40 వేల నుంచి రూ.50 వేలకు పెంచినట్టు వెల్లడించారు.
 

2019-02-01 14:58:44

update21- ఎన్నికల బడ్జెట్​

పీయూష్​ గోయల్​ బడ్జెట్​ ప్రసంగం పూర్తి. లోక్​సభ సోమవారానికి వాయిదా. బడ్జెట్​పై కేంద్ర మంత్రుల హర్షం. 
 

2019-02-01 14:58:14

update20- మార్కెట్లకు రెక్కలు...

భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు. బడ్జెట్ ప్రకటన తర్వాత దూసుకుపోతున్న స్టాక్‌మార్కెట్లు. 470 పాయింట్లకు పైగా లాభాల్లో సెన్సెక్స్. 130 పాయింట్లకు పైగా లాభాల్లో నిఫ్టీ. 
 

2019-02-01 14:57:40

update19-భవిష్యత్‌ ప్రణాళిక

వచ్చే ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్ల స్థాయికి దేశ ఆర్థిక వ్యవస్థ చేరుకుంటుంది. రానున్న పదేళ్లలో రూ.10 లక్షల కోట్ల ఆర్థికవ్యవస్థగా దేశాన్ని తీర్చిదిద్దడమే మా లక్ష్యం. మౌలిక, సామాజిక వసతుల మెరుగుదలకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాం. డిజిటల్‌ ఇండియాతో లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాము.
 

2019-02-01 14:52:18

update13- ఉజ్వల యోజనతో లాభాలే...

" ప్రధానమంత్రి ఉజ్వల యోజనతో 8 కోట్ల ఉచిత గ్యాస్​ కనెక్షన్లకు ఏర్పాటు. ఇందులో 6 కోట్ల గ్యాస్​ కనెక్షన్లు అందజేశాము. ఇది గ్రామాలకు మాత్రమే వర్తిస్తుంది."
---పీయూష్​ గోయల్​

 

2019-02-01 14:50:49

update12- అసంఘటితరంగ కార్మికులకు ప్రత్యేక పింఛను

" అసంఘటితరంగ కార్మికులకు ప్రత్యేక పింఛను పథకం. ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్‌ పేరుతో కార్మికులకు పింఛన్‌ పథకం ఏర్పాటు. 60 ఏళ్లు నిండిన వారికి నెలకు రూ.3 వేలు వచ్చేలా పథకం రూపొందించాం. నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3 వేల పింఛను లభిస్తుంది. అసంఘటిత రంగంలోని 10 కోట్లమంది కార్మికులకు ఈ పథకం వర్తిస్తుంది. రూ.500 కోట్ల ప్రారంభ నిధితో ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకం మొదలవుతుంది."


 

2019-02-01 14:47:14

update9-ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్​కు ప్రత్యేక గుర్తింపు

"ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గడిచిన ఐదేళ్లలో భారత్‌ ప్రత్యేక గుర్తింపు సాధించింది. సరళతర వాణిజ్య విధానం వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా ఆకర్షించగలిగాం. సుస్థిర, సమ్మిళిత వృద్ధి కొనసాగింపు లక్ష్యంతో బడ్జెట్‌ రూపొందించాం" 
                ---- పీయుష్​ గోయల్‌

 

2019-02-01 13:53:10

update6-బడ్జెట్​కు ఆమోదం

ఎన్నికల పద్దు 2019

2019-20 తాత్కాలిక బడ్జెట్​కు కేంద్రం ఆమోదం.
 

2019-02-01 13:52:42

update5-సానుకూలంగా స్టాక్​ మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
సెన్సెక్స్​ 109 పాయింట్లు, నిఫ్టీ 26 పాయింట్ల లాభాలు.
 

2019-02-01 13:52:09

update4- పార్లమెంట్​ వద్ద కట్టుదిట్ట భద్రత

పార్లమెంట్​ చేరుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి పీయుష్​ గోయల్​.
పార్లమెంట్​ చేరుకున్న బడ్జెట్​ ప్రతులు. కట్టుదిట్ట భద్రత ఏర్పాటు.
కేబినేట్​ భేటీ అనంతరం బడ్జెట్​ ప్రవేశపెట్టనున్న పీయుష్​.
 

2019-02-01 13:53:45

update7-ప్రారంభమైన బడ్జెట్​ సమావేశాలు

పార్లమెంట్​లో బడ్జెట్​పై పీయుష్​ గోయల్​ ప్రసంగం.
 

2019-02-01 13:44:07

update​2- కాసేపట్లో బడ్జెట్​

కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్​ గోయల్​ 11.00 గంటలకు లోక్​సభ ప్రారంభమవగానే బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్​పై సామాన్య ప్రజలు బోలెడన్ని ఆశలతో ఉన్నారు. ఎన్నికల వేళ ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా వరాల జల్లు కురిపిస్తుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. 

  •     బడ్జెట్​పై నెలకొన్న ఊహాగానాలను తెరదింపూతూ...మధ్యంతర బడ్జెట్​ ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.  మధ్యంతర బడ్జెట్​ కేవలం ఖర్చుల పత్రంగానే ఉండాలి. కానీ అధికార బడ్జెట్​ తాయిలాలు ప్రకటించనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

2019-02-01 13:48:34

update3-రైతులను ఆకట్టుకుంటుందా?

దేశంలో రైతు సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంది. ఇటీవల రాష్ట్రాల ఎన్నికల్లో చర్యల రుణమాఫీ అస్త్రం పనిచేయటంతో దీనినే కేంద్రం అమలు చేయనున్నట్లు చర్చ జరిగింది. మధ్యలో వడ్డీ మాఫీపై చర్చ జరిగనప్పటికి....తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న రైతుబంధు లాంటి ప్రత్యక్ష పెట్టుబడి సహాయ పథకం వైపు మొగ్గుచూపుతున్నట్లు కేంద్రం సంకేతాలు ఇచ్చింది. కానీ ప్రస్తుతం రైతులకు ప్యాకేజీ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా పలువురు భాజపా నాయకుల సంకేతాలు ఇవ్వటం విశేషం.  ఈ సంవత్సరం రైతులకు రుణం అందించే రుణం మరో లక్ష కోట్లు పెంచాలని ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

2019-02-01 13:42:17

update​1- పార్లమెంట్​లో మొదలైన బడ్జెట్​ ప్రసంగం

పార్లమెంట్​లో మొదలైన బడ్జెట్​ ప్రసంగాన్నికేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్​ గోయల్​ ప్రారంభించారు.

2019-02-01 13:38:45

మళ్లీ గెలిపించేనా బడ్జెట్ ??​

పీయూష్​ గోయల్​ ప్రసంగం పూర్తి

పీయూష్​ గోయల్​ బడ్జెట్​ ప్రసంగం పూర్తి. లోక్​సభ సోమవారానికి వాయిదా. బడ్జెట్​పై కేంద్ర మంత్రుల హర్షం వ్యక్తం చేశారు
 

2019-02-01 13:00:54

మార్కెట్లకు రెక్కలు...

భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు. బడ్జెట్ ప్రకటన తర్వాత దూసుకుపోతున్న స్టాక్‌మార్కెట్లు. 470 పాయింట్లకు పైగా లాభాల్లో సెన్సెక్స్. 130 పాయింట్లకు పైగా లాభాల్లో నిఫ్టీ. 
 

2019-02-01 12:50:26

భవిష్యత్‌ ప్రణాళిక

వచ్చే ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్ల స్థాయికి దేశ ఆర్థిక వ్యవస్థ చేరుకుంటుంది. రానున్న పదేళ్లలో రూ.10 లక్షల కోట్ల ఆర్థికవ్యవస్థగా దేశాన్ని తీర్చిదిద్దడమే మా లక్ష్యం. మౌలిక, సామాజిక వసతుల మెరుగుదలకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాం. డిజిటల్‌ ఇండియాతో లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాము.
 

2019-02-01 12:50:21

ఆదాయపన్ను పరిమితి సడలింపుతో సభలో హర్షాతిరేకాలు

ఆదాయ పన్ను పరిమితి 2.5 లక్షల నుంచి 5 లక్షలకు పెంపు. కొంత సమయం మోదీ నినాదాలతో మార్మోగిన సభ... 

2019-02-01 12:49:15

ఆదాయపు పన్ను

వేతన జీవులు, పింఛనుదారులకు కేంద్రం ఊరటనిచ్చింది. ఆదాయపన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంచుతున్నట్టు పీయూష్​ గోయల్​ ప్రకటించారు. రూ.5 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను లేదనిస్పష్టం చేశారు.స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిమితి రూ.40 వేల నుంచి రూ.50 వేలకు పెంచినట్టు వెల్లడించారు.
---ఆర్థికమంత్రి ,పీయూష్‌ గోయల్‌
 

2019-02-01 12:47:44

జీఎస్టీ

"సినిమా థియేటర్లపైజీఎస్టీ 12 శాతానికి తగ్గింపు. ఇళ్ల కొనుగోలుదారులకు జీఎస్టీ మినహాయింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటాము. మంత్రివర్గ ఉపసంఘం నివేదికను జీఎస్టీ మండలి ముందు ప్రవేశపెట్టి తుది నిర్ణయం తీసుకుంటాం."
---ఆర్థికమంత్రి ,పీయూష్‌ గోయల్‌
 

2019-02-01 12:45:43

ఐటీ రిటర్నులు

"ప్రస్తుతం నెలకు రూ.97,100 కోట్లు పన్ను వసూళ్లవుతున్నాయి. గడచిన ఐదేళ్లలో రాష్ట్రాల పన్ను వసూళ్లు సాలీనా 14 శాతం మేర పెరిగాయి. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలతో రూ.లక్ష కోట్లకు పైగా కొత్తగా లెక్కల్లోకి వచ్చాయి. 2017-18లో కోటి 6 లక్షల మంది ఐటీ రిటర్న్‌లు దాఖలు చేశారు."

---ఆర్థికమంత్రి ,పీయూష్‌ గోయల్‌

2019-02-01 12:42:57

రక్షణ రంగానికి 3 లక్షల కోట్లు

"ఈ ఏడాది రక్షణ రంగానికి రూ.3 లక్షల కోట్లుకేటాయిస్తున్నాము. అవసరమైతే అదనపు నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాము. "ఒక ర్యాంకు ఒక పెన్షన్​" పేరుతో 35వేల కోట్లు మన సైనికులకు అందించాము. ఫించన్ల పెంపునూ ప్రకటించాము."

---ఆర్థికమంత్రి ,పీయూష్‌ గోయల్‌

2019-02-01 12:38:58

లక్ష డిజిటల్​ గ్రామాలే లక్ష్యం

"దేశంలో 268 వరకు మొబైల్‌ పరిశ్రమలుఏర్పాటయ్యాయి. వచ్చే ఐదేళ్లలో లక్ష డిజిటల్‌ గ్రామాల ఏర్పాటే మా లక్ష్యం. ఈశాన్య భారతానికీ మౌలికరంగ అభివృద్ధి ఫలితాలు అందిస్తున్నాం. ఐదేళ్లలో సౌరవిద్యుత్‌ ఉత్పత్తి 10 రెట్లు ఎక్కువ పెంచాం."
 

---ఆర్థికమంత్రి ,పీయూష్‌ గోయల్‌

2019-02-01 12:23:17

రైతులపై వరాల జల్లు

"చిన్న, సన్నకారు రైతులకు మద్దతునివ్వడానికే కిసాన్​ సమ్మాన్​ నిధి. ప్రతీ రైతుకు మూడు దఫాలుగా  6వేల రూపాయల మంజూరు.  ఈ పథకం రెండెకరాల కన్నా తక్కువ భూమి ఉన్న అన్నదాతలకు వర్తిస్తుంది. "

----ఆర్థికమంత్రి ,పీయూష్‌ గోయల్‌

2019-02-01 12:22:22

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్​కు ప్రత్యేక గుర్తింపు

"ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గడిచిన ఐదేళ్లలో భారత్‌ ప్రత్యేక గుర్తింపు సాధించింది. సరళతర వాణిజ్య విధానం వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా ఆకర్షించగలిగాం. సుస్థిర, సమ్మిళిత వృద్ధి కొనసాగింపు లక్ష్యంతో బడ్జెట్‌ రూపొందించాం" 
----ఆర్థికమంత్రి ,పీయూష్‌ గోయల్‌

2019-02-01 12:33:15

రైల్వేకు 64,587 కోట్లు కేటాయింపు

రైల్వేకు బడ్జెటరీ సపోర్టుగా రూ.64,587కోట్లు మంజూరు. మిజోరాం, మేఘాలయా రాష్ట్రాలను రైల్వేతో అనుసంధానం చేశాం

----ఆర్థికమంత్రి ,పీయూష్‌ గోయల్‌

2019-02-01 12:29:57

ఉజ్వల యోజనతో లాభాలే...

" ప్రధానమంత్రి ఉజ్వల యోజనతో 8 కోట్ల ఉచిత గ్యాస్​కనెక్షన్లకు ఏర్పాటు. ఇందులో 6 కోట్ల గ్యాస్​ కనెక్షన్లు అందజేశాము. ఇది గ్రామాలకు మాత్రమే వర్తిస్తుంది."
----ఆర్థికమంత్రి ,పీయూష్‌ గోయల్‌

2019-02-01 12:26:56

అసంఘటితరంగ కార్మికులకు ప్రత్యేక పింఛను

" అసంఘటితరంగ కార్మికులకు ప్రత్యేక పింఛను పథకం.ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్‌ పేరుతో కార్మికులకు పింఛన్‌ పథకం ఏర్పాటు. 60 ఏళ్లు నిండిన వారికి నెలకు రూ.3 వేలు వచ్చేలా పథకం రూపొందించాం. నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3 వేల పింఛను లభిస్తుంది. అసంఘటిత రంగంలోని 10 కోట్లమంది కార్మికులకు ఈ పథకం వర్తిస్తుంది. రూ.500 కోట్ల ప్రారంభ నిధితో ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకం మొదలవుతుంది."

----ఆర్థికమంత్రి ,పీయూష్‌ గోయల్‌

2019-02-01 12:25:22

విద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలకు భారీ నిధులు

"విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాలకు భారీగా నిధులు. ప్రధానమంత్రి సడక్‌ యోజనకు రూ.19 వేల కోట్లు కేటాయించాం. ఆయుష్మాన్‌ భారత్​తో 50 కోట్ల పేదలకు ఉచిత వైద్యం అందుతుంది. కొత్తగా ఎన్నో రాష్ట్రాలకు ఎయిమ్స్‌లు మంజూరు చేశాం"

----ఆర్థికమంత్రి ,పీయూష్‌ గోయల్‌

2019-02-01 12:15:48

ద్రవ్యోల్బణంపై పీయుష్​

" 2009-14లో ద్రవ్యోల్బణం 10.1శాతం. భాజపా హయాంలో ద్రవ్యోల్బణం శాతం చాలా తగ్గింది. 2018-19లో ద్రవ్యలోటు 3.4శాతం" 
----ఆర్థికమంత్రి ,పీయూష్‌ గోయల్‌

2019-02-01 11:06:35

ప్రారంభమైన బడ్జెట్​ సమావేశాలు

  • పార్లమెంట్​లో బడ్జెట్​పై పీయుష్​ గోయల్​ ప్రసంగం.
     

2019-02-01 10:56:54

బడ్జెట్​కు ఆమోదం

  • 2019-20 తాత్కాలిక బడ్జెట్​కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
     
Last Updated : Feb 1, 2019, 3:43 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details