ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / bharat

సీబీఐ చీఫ్​ నియామకంపై మాటల యుద్ధం - మల్లికార్జున్​ ఖర్గే

కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన డైరెక్టర్​గా రిషికుమార్​ శుక్లా నియామకంపై ప్రతిపక్షం, ప్రభుత్వం మధ్య ఆరోపణల పర్వం కొనసాగింది.

karge

By

Published : Feb 3, 2019, 6:20 AM IST

సీబీఐ నూతన డైరెక్టర్​గా మధ్యప్రదేశ్ మాజీ డీజీపీ రిషి కుమార్ శుక్లాను నియమించడంపై ప్రతిపక్షాలకు, ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీలో సభ్యులైన లోక్​సభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్​ ఖర్గే అసమ్మతి తెలిపారు. ఎంపిక ప్రమాణాలు నీరుగార్చారని ఆరోపించారు. ప్రభుత్వం ఖర్గే విమర్శలను తిప్పికొట్టింది. ఆయన ఆరోపణలు వాస్తవ దూరంగా ఉన్నాయని ఆరోపించారు.

'సీనియారిటీ ఒక్కటే ప్రామాణికం కాదు'

శుక్లా నియామకంపై తన అసమ్మతిని తెలియజేస్తూ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 'అవినీతి నిరోధక దర్యాప్తు' కేసుల్లో ఎలాంటి అనుభవంలేని రిషి కుమార్​ను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. సీబీఐ, సుప్రీం కోర్టు తీర్పులను నియంత్రించే దిల్లీ స్పెషల్​ పోలీస్​ ఎస్టాబ్లిష్​మెంట్ చట్టాన్ని(డీఎస్​పీఈ) ఉల్లంఘించిందన్నారు. ఇలాంటి ఉన్నత స్థాయి పదవులకు కేవలం సీనియారిటీ ఒక్కటే ప్రమాణికం కాదని, అవినీతి నిరోధక కేసుల్లో అనుభవాన్ని లెక్కలోకి తీసుకోవాలని ఖర్గే పేర్కొన్నారు.

నిబంధనలను మార్చడానికి ప్రయత్నం

రిషి కుమార్​ శుక్లా నియామకంపై ఖర్గే అసమ్మతి ప్రకటించడాన్ని తీవ్రంగా విమర్శించారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్​. తనకు ప్రాధాన్యం ఉన్న అధికారులను నియమించాలనే దురుద్దేశంతోనే ఖర్గే నిబంధనలను మార్చడానికి ప్రయత్నించాడని ఆరోపించారు. కమిటీ చర్చల్లోని తన సొంత ఆలోచనను మాత్రమే మీడియాకు తెలియజేశారన్నారు. సీనియారిటీ, సర్వీస్​ రికార్డు, అవినీతి నిరోధక దర్యాప్తు అనుభవం ఆధారంగా ఎంపిక చేసినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details