ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / bharat

శరద్​ పవార్ ఇంట్లో విపక్షాల భేటీ - Pawar's residence

సంయుక్త వ్యూహాలపై చర్చించేందుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్​ ఇంట్లో విపక్ష నేతలు సమావేశమయ్యారు.

శరద్​ పవార్​ ఇంట్లో విపక్షాల నేతల భేటీ

By

Published : Feb 5, 2019, 8:30 AM IST

శరద్​ పవార్​ ఇంట్లో విపక్షాల నేతల భేటీ
దిల్లీలోని నేషలిస్ట్​ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్​పవార్​ ఇంట్లో విపక్షాల నేతలు సోమవారం సమావేశమయ్యారు. సీబీఐ దుర్వినియోగం, భాజపా పాలన వంటి పలు అంశాలపై సమాలోచనలు జరిపారు. మొదటగా రాజ్యసభలోని ప్రతిపక్ష నేత ఛాంబర్​లో గులాం నబీ ఆజాద్​తో నేతలు భేటీ అయ్యారు.

"సీబీఐని దుర్వినియోగం చేస్తూ తమపై కేంద్రం దాడులు చేయిస్తోంది. వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగంతో యువతరం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రాజ్యాంగ సంస్థలను భాజపా నిర్వీర్యం చేస్తోంది. ఈ మూడు విషయాల్లో పూర్తి స్థాయి పరిష్కారం కోసం మళ్లీ కలుస్తాం. కోల్​కతా విషయంలో మమతా బెనర్జీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం."
- శరద్ పవార్, ఎన్సీపీ అధినేత

సమావేశంలో ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కశ్మీర్ మాజీ సీఎం ఫారుఖ్ అబ్దుల్లా, తృణమూల్ నేత డెరెక్ ఒబ్రెయిన్ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details