ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / bharat

"సాధ్యమైతేనే లెక్కింపు" - లెక్కింపు

వీవీప్యాట్​ల లెక్కింపును పెంచాలన్న వివిధ పార్టీల విన్నపంపై ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది.

ఈవీఎం యంత్రాలు

By

Published : Feb 5, 2019, 7:07 AM IST

ఈవీఎం
వీవీప్యాట్​ పేపర్ల లెక్కింపును పెంచటంపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత నిర్ణయిస్తామని ఎన్నికల సంఘం(ఈసీ) వివిధ పార్టీ ప్రతినిధులకు తెలిపింది. 50 శాతం వీవీప్యాట్​ పేపర్లను ఈవీఎంలతో సరిచూడాలని కోరుతూ 23 పార్టీలు సోమవారం నాడు ఎన్నికల సంఘానికి వినతి పత్రం సమర్పించాయి.

వీవీప్యాట్​, ఈవీఎంల పోలిక ఎంత వరకు ఉండాలన్న దానిపై భారత గణాంక సంస్థను ఒక నివేదిక తయారు చేయాలని ఈసీ ఇప్పటికే కోరింది. దీనితో పాటు వివిధ న్యాయస్థానాల తీర్పులను గమినించి నిర్ణయం తీసుకుంటామని పార్టీలకు వెల్లడించింది.

ఈవీఎంల ట్యాంపరింగ్​ అనుమానాలను నివృత్తం చేయాలని ప్రతిపక్షాలు కోరాయి. అన్ని సందేహాలను పరిశీలించి, చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details