"సీబీఐ దాని పని అది చేయాలా వద్దా? సీబీఐ తన పనిని అది చేస్తే రాజకీయ కుట్ర... చేయకపోతే పంజరంలో చిలక అని అంటారు. వారు జ్ఞానంతో ఆలోచించాలి. " - నిర్మలాసీతారామన్, రక్షణ శాఖ మంత్రి
"సీబీఐ దాని పని అది చేయాలా వద్దా? సీబీఐ తన పనిని అది చేస్తే రాజకీయ కుట్ర... చేయకపోతే పంజరంలో చిలక అని అంటారు. వారు జ్ఞానంతో ఆలోచించాలి. " - నిర్మలాసీతారామన్, రక్షణ శాఖ మంత్రి
బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు నేరుగా రాజ్యాంగ విధానాలపై దాడి చేయడమేనని భాజపా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అది ముఖ్యమంత్రి నియంతృత్వాన్ని ప్రతిబింబిస్తోందని ఆరోపించారు.
" కోల్కతాలో తాజా పరిణామాలు, సీబీఐ దర్యాప్తును అడ్డుకోవడం ఒక వింత, ఇంతవరకు ఎప్పుడూ జరగని విషయం. అది మమత బెనర్జీ నియంతృత్వ పోకడను ప్రతిబింబిస్తోంది. ఆమె దేని ద్వారా అయితే అధికారాన్ని పొందిందో ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. "- జీవీఎల్ నరసింహా రావు, భాజపా అధికార ప్రతినిధి
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే సీబీఐ దర్యాప్తు చేపట్టిందని గుర్తుచేశారు నరసింహా రావు. నగర పోలీసుల చర్యలతో సర్వోన్నత న్యాయస్థానాన్ని అగౌరవపరిచారని విమర్శించారు.