ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / bharat

"బడా మొండి వ్యాపారులకు భయం పుట్టించాం"

బ్యాంకులకు మొండి బకాయిలు పడ్డ బడా వ్యాపారుకూ వెన్నులో వణుకు పుట్టేలా చేశాం.

ఎన్నికల పద్దు

By

Published : Feb 1, 2019, 1:09 PM IST

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ మొండి బకాయిలు, నిరర్థక ఆస్తుల వివరాలను ప్రస్తావించారు. బ్యాంకింగ్​ వ్యవస్థను పటిష్టం చేసామని స్పష్టం చేశారు.

ఎన్నికల పద్దు

"2014లో 5.4 లక్షల కోట్ల విలువైన అపరిష్కృత, నిరర్థక ఆస్తులు ఉండేవి. అయినప్పటికీ వాటిని నిరర్థక ఆస్తులుగా పరిగణించలేదు. మా సర్కారుకు దమ్ముంది కనుకే ఆర్​బీఐకి మొండి బకాయిలు, నిరర్థక ఆస్తుల వివరాలపై దృష్టి పెట్టి, బ్యాంకుల వాస్తవిక స్థితి దేశం ముందుంచాలని చెప్పాం. గత ప్రభుత్వాలను ఎండగట్టదగిన ఫోన్​ బ్యాంకింగ్​ వ్యవస్థను మేము పారద్రోలాం. ఇంతకుముందు చిన్న వ్యాపారులకు మాత్రమే బ్యాంకు అప్పులపై భయముండేది. ఇప్పడు బడా వ్యాపారులూ బ్యాంకు బకాయిల గురించి కంగారు పడేలా చేశాం. ఇప్పటికే రూ.3 లక్షల కోట్ల మొండి బకాయిలు వసూలు చేశాం. మూడు బ్యాంకులు బ్యాంక్ ఆఫ్​ ఇండియా, ఓబీసీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలను పీసీఏ నిబంధనల నుంచి తొలగించాం. మిగిలిన బ్యాంకులూ త్వరితగతిన ఆ నిబంధనల నుంచి బయటకు వస్తాయని, బ్యాంకు వ్యవస్థలో బలోపేతమవుతాయని ఆశిస్తున్నాం. అవినీతిని పారద్రోలేందుకు చర్యలు చేపట్టాం. పారదర్శకతను తీసుకువచ్చాం. మా ప్రభుత్వం అవినీతి రహిత పాలనను అందించింది."
-పీయూష్​ గోయల్, కేంద్ర ఆర్థిక మంత్రి

ABOUT THE AUTHOR

...view details