ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / bharat

"ఓట్ ఆన్ అకౌంట్ కాదు... ఓట్ల కోసం అకౌంట్​" - interim

బడ్జెట్​ వివరణకు పీయూష్ అధిక సమయం తీసుకున్నారని, ప్రసంగం పూర్తిగా ఎన్నికల ప్రచారంలా సాగిందని చిదంబరం విమర్శించారు.

ex finance minister

By

Published : Feb 1, 2019, 4:41 PM IST

మధ్యంతర బడ్జెట్​పై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సభలో ప్రవేశపెట్టింది 'ఓట్​ ఆన్ అకౌంట్'​ కాదని.. 'ఓట్ల కోసం అకౌంట్'​ అని ఎద్దేవా చేశారు. మధ్యంతర బడ్జెట్​ అంటూ పూర్తి స్థాయి పద్దును ప్రవేశపెట్టారని చిదంబరం ఆరోపించారు.

ఎన్నికల మేనిఫెస్టోలా బడ్జెట్: కాంగ్రెస్

కాంగ్రెస్ తీర్మానాలను కాపీ కొట్టినందుకు ఆర్థిక మంత్రి పీయూష్​ గోయల్​కు కృతజ్ఞతలు అంటూ చురకలంటించారు చిదంబరం. మళ్లీ వారి ప్రభుత్వం రాదని తెలిసే.... సభా సంప్రదాయాలను విస్మరించి, ఇటువంటి బడ్జెట్​ను ప్రవేశపెట్టిందని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details