కాసేపట్లో మధ్యంతర బడ్జెట్ - మధ్యంతర
మధ్యంతర బడ్జెట్ 2019ను కాసేపట్లో ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
పీయూష్ గోయల్
కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ నేడు 11.00 గంటలకు లోక్‌సభ ప్రారంభమవగానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌పై సామాన్య ప్రజలు బోలెడన్ని ఆశలతో ఉన్నారు. ఎన్నికల వేళ ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా వరాల జల్లు కురిపిస్తుందన్నది విశ్లేషకుల అభిప్రాయం.
- బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రోజు ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందుంచటం ఆనవాయితీ. ఈసారి కేంద్రం ఇలాంటిదేమీ లేకుండానే బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది.
- పీయూష్ గోయల్‌ను 23 జనవరి 2018న ఆర్థిక మంత్రిగా రాష్ట్రపతి కార్యాలయం నోటిఫై చేసింది. ఆరుణ్ జైట్లీ చికిత్స కోసం అమెరికా వెళ్లటమే కారణమని ప్రభుత్వం తెలిపింది.
- మొదట ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందన్న ఊహగానాలు కొన్ని రోజులు ప్రచారంలో ఉన్నాయి. కానీ బుధవారం నాడు ఆర్థిక శాఖ మధ్యంతర బడ్జెట్ మాత్రమేనని ప్రకటించింది.
- రైతులకు సంబంధించి భారీ ప్యాకేజీ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదట రైతు రుణంపై వడ్డీ మాఫీ చేస్తారని, రైతు రుణ మాఫీ చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. అనంతరం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు లాంటి ప్రత్యక్ష పెట్టుబడి సహాయం పథకం దిశగా కేంద్ర అడుగులు వేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు రైతులకు ప్యాకేజీ ప్రకటించనున్నట్లు భాజపా నాయకులు సంకేతాలు ఇచ్చారు.
- మధ్య తరగతి వర్గం ఎప్పటి నుంచో ఆశిస్తున్నట్లు ఆదాయపు పన్ను మినహాయింపును రూ. 5 లక్షలకు పెంచుతారన్న వార్తలు ఉన్నాయి. భాజపాకు పట్టున్న ఈ వర్గంపై వరాల జల్లు ఖాయమని నిపుణుల అంచనా.
- వస్తు సేవల పన్ను, నోట్ల రద్దు వల్ల ఎక్కువ నష్టపోయింది చిన్న తరహా పరిశ్రమలే. వీరికోసం ఇప్పటికే ఆర్బీఐ చర్యలు ప్రారంభించినప్పటికీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తుందన్న ఆశ ఆ వర్గాల్లో ఉంది.
- 2017 వరకు బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి రోజు సభలో ప్రవేశపెట్టేవారు. దీనిని ఫిబ్రవరి 1కి మార్చింది ప్రస్తుత ప్రభుత్వం. బడ్జెట్‌ను సమయాన్ని సాయంత్రం నుంచి ఉదయానికి మార్చింది కూడా వాజ్‌పేయీ హయాంలోని ఎన్డీఏనే కావటం విశేషం.