పదోన్నతుల్లో ఓ సామాజికవర్గానికే ప్రాధాన్యం ఇచ్చారని వైకాపా అధినేత జగన్ చేసిన ఆరోపణలపై డీజీపీ ఆర్.పి.ఠాకూర్ తిరుపతిలో స్పందించారు. పోలీసులకు కులం ఉండదని, తమది ఖాకీ కులమని సమాధానం ఇచ్చారు. తాను నిజాయితీగా పనిచేస్తున్నానని, అవినీతి నిరోధక శాఖ డీజీగా తన పనితీరు ప్రజలకు తెలుసని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకే ప్రతిభ ఆధారంగానే పదోన్నతలు ఇచ్చారని స్పష్టం చేశారు. జగన్ చేసిన ఆరోపణలపై ఈసీ వివరణ కోరితే.. తాను సమాధానం ఇస్తానని అన్నారు.
మేం పోలీసులం.. మాది ఖాకీ కులం: డీజీపీ - jagan
జగన్ ఆరోపణలపై డీజీపీ ఆర్.పి.ఠాకూర్ తిరుపతిలో స్పందించారు. హైకోర్టు ఆదేశాల మేరకే ప్రతిభ ఆధారంగానే పదోన్నతలు ఇచ్చారని చురకలు వేశారు.
ఈసీకి నేను సమాధానం చెప్తా -డీజీపీ ఆర్.పి.ఠాకూర్