చివరి రోజు ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 31, 2024, 10:25 AM IST
CS Jawahar Reddy Decision to induct IPS AB Venkateswarao into service :సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుని సర్వీస్‌లోకి తీసుకోవాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఉద్యోగ విరమణ చేయనున్న (AB Venkateswara Rao Retire Today) దృష్ట్యా పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. ఏబీ వెంకటేశ్వరరావు సర్వీసులోకి తీసుకునేందుకు వీలుగా ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరీ కాసేపట్లో ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది.