14 days Judicial Custody for YouTuber Praneet : సామాజిక మాధ్యమంలో తండ్రి-కుమార్తె వీడియోపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును బుధవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రణీత్‌ను నాంపల్లిలో పోలీసులు హాజరుపరిచారు. ఈ క్రమంలో నిందితుడికి 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్‌ను నాంపల్లి కోర్టు విధించింది. బుధవారం బెంగళూరులో యూట్యూబర్ ప్రణీత్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 11, 2024, 6:38 PM IST
యూట్యూబర్ ప్రణీత్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
YouTuber Praneet Judicial Custody (ETV Bharat)
ప్రణీత్‌పై 67బీ ఐటీ, పోక్సో, 79, 294 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతనితో పాటు మరో ముగ్గురు నిందితులపై కూడా కేసు నమోదు చేశారు. ఏ1గా ప్రణీత్, ఏ2గా నాగేశ్వర్రావు, ఏ3గా యువరాజ్, ఏ4గా సాయి ఆదినారాయణపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు.