జులై 1 నుంచి కొత్త సిమ్ కార్డు రూల్స్- ఇక నుంచి ఆ పప్పులు ఉడకవు!
Published : Jun 29, 2024, 1:32 PM IST
TRAI New Rules On SIM Swap : సిమ్ స్వాప్, రీప్లేస్మెంట్ మోసాలను అరికట్టడానికి సవరించిన నింధనలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ట్రాయ్(TRAI) శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు 2024 మార్చి 14న తాము జారీ చేసిన టెలికమ్యూనికేషన్ మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (తొమ్మిదవ సవరణ) నిబంధనలు అమలు అవుతాయని తెలిపింది. ఈ సవరణలో, సిమ్ పోర్టింగ్‌కు అవసరమైన యూనిక్ పోర్టింగ్ కోడ్(UPC) కేటాయింపు రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేసే కొత్త విధానాన్ని చేర్చింది. ఇందులో భాగంగా సిమ్ స్వాప్/రిప్లేస్మెంట్ చేసిన తర్వాత 7 రోజుల తుది గడువు కన్నా ముందు UPCను కేటాయించరు. ఈ విధానాన్ని అమలు చేయాలంటే యాక్సెస్ ప్రొవైడర్లు, MNP(Mobile Number Portability) ప్రొవైడర్ల టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్, ప్రాసెస్‌లలో మార్పులు చేయవలసి ఉంటుందని గతంలో ట్రాయ్ పేర్కొంది.