కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం- శామ్ పిట్రోడాకు మళ్లీ బాధ్యతలు
Published : Jun 26, 2024, 9:19 PM IST
|Updated : Jun 26, 2024, 11:01 PM IST
![కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం- శామ్ పిట్రోడాకు మళ్లీ బాధ్యతలు Sam Pitroda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-06-2024/1200-675-21804488-thumbnail-16x9-eee.jpg)
Sam Pitroda Congress :కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనంగా మారిన శామ్ పిట్రోడాను తిరిగి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్గా నియమించింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ బుధవారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. గత నెలలో దక్షిణ భారతీయులను ఆఫ్రికన్లతో పోలుస్తూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ మళ్లీ ఆయనకు బాధ్యతలు అప్పగించింది.