ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రెచ్చగొడుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులు- టీడీపీ ఫ్లెక్సీలు ధ్వంసం - తెలుగుదేశం ఫ్లెక్సీ చించివేసిన ఘటన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2024, 12:44 PM IST

YSRCP Activists Tear TDP Flexi: ప్రకాశం జిల్లా కనిగిరిలో వైఎస్సార్​సీపీ శ్రేణుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. తెలుగుదేశం అంటే గిట్టని వైఎస్సార్​సీపీ శ్రేణులు దుర్మార్గమైన చర్యలకు ఒడిగడుతున్నాయని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. వారి హేయమైన చర్యలు ఎంతటికి దిగజారాయంటే, టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించి దాని ఆనవాళ్లు కూడా అక్కడ లేకుండా చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కనిగిరి పట్టణంలో టీడీపీ శ్రేణులు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేయగా, కొందరు దుండగులు ఆ ఫ్లెక్సీలను చించివేశారు. అంతేకాకుండా చించివేసిన ఫ్లెక్సీ ముక్కలు అక్కడ కనిపించకుండా చేశారు.  

టీడీపీ జనసేన కూటమి ప్రకటించిన తొలి జాబితాలో ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి కనిగిరి సీటు దక్కింది. ఈ క్రమంలో తెలుగుదేశం శ్రేణులు ఆయనకు మద్దతుగా స్థానికంగా ఇందిరా కాలనీలో ప్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీని వైఎస్సార్​సీపీ దుండగులు అర్థరాత్రి వేళ చించివేశారు. ఈ ఘటనపై స్పందించిన తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు యథాస్థానంలో మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details