కుటుంబ కలహాలతో హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ - Duvvada Approached to High Court - DUVVADA APPROACHED TO HIGH COURT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 20, 2024, 9:17 AM IST
YSRCP MLC Duvvada Srinivas Approached to High Court at Family Controversy : తన ఇంటిపైకి వచ్చి భార్య వాణి, కుమార్తె హైందవి వివాదం చేస్తున్నారని, వారిపై నమోదు చేసిన కేసులో టెక్కలి పోలీసులు దర్యాప్తు చేయడం లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్‌ఎన్ చక్రవర్తి ఈ వ్యాజ్యంపై విచారణ జరిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.
అంతకు ముందు పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది (జీపీ) కేఎం కృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ ఫిర్యాదు ఆధారంగా ఐదు రోజుల కిందటే కేసు నమోదు చేశామని తెలియజేశారు. వాణి, హైందవిలకు సెక్షన్ 41(ఏ) నోటీసు ఇచ్చి వివరణ కోరామని తెలిపారు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్‌పై ఆయన భార్య సైతం ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. కోర్టుకు వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని కోరారు.