ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

టీడీపీ నేతలపై వైఎస్సార్సీపీ దాడులు- రోడ్డుపై వాహనాలు అడ్డంగా పెట్టిమరీ రాళ్లు, కర్రలతో తెగబడ్డ వైనం - టీడీపీ నేతలపై వైఎస్సార్సీపీ దాడులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 28, 2024, 2:56 PM IST

YSRCP Attack on TDP Leaders: వైఎస్సార్సీపీ నేతల దౌష్టికం పరాకాష్టకు చేరింది. టీడీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడులకు తెగబడుతున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో "రా-కదలి రా" కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న టీడీపీ శ్రేణులుపై వైఎస్సార్సీపీ శ్రేణులు "జై జగన్" అంటూ దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే: కల్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం ముప్పులకుంట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఉరవకొండలో "రా-కదిలి రా" కార్యక్రమానికి శనివారం హాజరయ్యారు.

అనంతరం తమ సొంత గ్రామానికి తిరిగి వెళ్తున్న సమయంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు వాహనాలను రోడ్డుకు అడ్డుగా పెట్టి టీడీపీ శ్రేణులపై విచక్షణారహితంగా రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. దీంతో వారు పరుగులు తీస్తూ ఉరవకొండ ఆస్పత్రికి చేరుకున్నారు. రేణుమాకులపల్లిలో జరిగిన ఈ ఘటనలో తలారి రవితేజ, నరసింహులు, నల్లప్ప, వన్నూరుస్వామి తీవ్రంగా గాయాలయ్యాయి. తెలుగుదేశం సభ విజయవంతం కావడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పార్టీ నాయకులు వాపోతున్నారు. ఈ ఘటనపై ఉరవకొండ పోలీసులు వివరాలు సేకరించారు.

ABOUT THE AUTHOR

...view details