ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్ జగన్ మీడియా సమావేశం- ప్రత్యక్షప్రసారం - YS Jagan Press Meet - YS JAGAN PRESS MEET

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 4, 2024, 6:06 PM IST

Updated : Jun 4, 2024, 6:18 PM IST

YS Jagan Press Meet on AP Election Results Live: వరమిచ్చిన శివుడికే కీడు తలపెట్టి చివరికి తన తలపై తానే చేయిపెట్టుకుని భస్మమైపోయాడు భస్మాసురుడు! ఆంధ్ర రాష్ట్రంలో అవతరించిన కలియుగ భస్మాసురుడు జగన్‌కూ అదే గతి పట్టింది!! ఒక్కఛాన్స్ అని వేడుకుంటే అఖిలాంధ్రులు 151 సీట్లు ఇచ్చి 2109 ఎన్నికల్లో అనుగ్రహించారు. అంతటి అఖండ మెజార్టీ కట్టబెట్టిన జనాన్ని జగన్‌ రాచి రంపాన పెట్టారు. పన్నులతో పీల్చిపిప్పిచేశారు. ప్రతిపక్షంలో ఉండగా బాదుడే బాదుడు అంటూ రాగాలు తీసి కుర్చీ ఎక్కాక బండ బాదుడు బాదారు. ఆర్టీసీ ఛార్జీలు, కరెంటు బిల్లులు, పెట్రోల్‌ ధరలు, నిత్యావసర సరుకులు ఇలాఅన్ని విధాలుగా భారాలు మోపి ప్రజల ఆర్థిక స్థితిగతుల్ని చిన్నాభిన్నం చేశారు. అందుకే 2019లో నెత్తినపె‌ట్టుకున్న ఓటర్లే ఐదేళ్లు తిరిగేసరికి నేలకేసికొట్టారు. ఎన్నికల కౌంటింగ్​లో విజయ పథంలో కూటమి అభ్యర్థులు దూసుకెళ్లడంతో, వైసీపీ కుప్పకూలింది. ప్రజాతీర్పుకు తలొగ్గి, ఓటమిని అంగీకరించిన జగన్ రాజీనామాకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ మీడియా సమావేశం నిర్వహిస్తోన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారంలో చూద్దాం.. 
Last Updated : Jun 4, 2024, 6:18 PM IST

ABOUT THE AUTHOR

...view details