ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తెనాలిలో వివాహిత దారుణ హత్య- గొంతుకోసి హతమార్చిన దుండగులు - తెనాలిలో వివాహిత దారుణ హత్య

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 15, 2024, 12:35 PM IST

Woman Murder in Tenali: గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేటలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. స్థానిక భవనం వారి వీధిలో నివాసముంటున్న మహిళను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి కిరాతకంగా హత్య చేశారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఓ వ్యక్తి తన భార్యను వేధిస్తున్నాడని, అతడే ఆమెను విచక్షణా రహితంగా హతమార్చాడని మృతురాలి భర్త ఆరోపించారు. సమాచారం అందిన వెంటనే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. గురువారం తెల్లవారుజామున పదునైన ఆయుధంతోనే గొంతు కోయడంతో అలేఖ్య మృతిచెందినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చామని పోలీసులు వెల్లడించారు. హత్య జరిగిన విధానం చూస్తే తెలిసిన వ్యక్తులే ఇలా చేసినట్లు తెలుస్తోందన్నారు. 

"గత కొన్నేళ్లుగా అన్నెం శ్రీనివాస్‌ అనే వ్యక్తి నా భార్యను తరచూ వేధించేవాడు. మమ్మల్ని చంపుతామని పలుమార్లు బెదిరించాడు. నా భార్యపై హత్యాయత్నం కూడా చేశాడు. దీనిపై మేము కేసులు కూడా పెట్టాం. శిక్ష పడే అవకాశం ఉండటంతోనే నా భార్యను దారుణంగా హత్య చేశాడు. బెదిరింపుల వరకే ఆగుతాడని అనుకున్నాం. కానీ ఇంత ఘాతుకానికి పాల్పడతాడని అనుకోలేదు." - రమేశ్​, మృతురాలి భర్త

ABOUT THE AUTHOR

...view details