మద్యం తాగొచ్చి దాడికి తెగబడ్డ భర్త- చేతిలోని గొడ్డలి లాక్కుని నరికి చంపిన భార్య
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 17, 2024, 10:44 PM IST
Wife Killed Husband in Anantapur District : మద్యానికి బానిసైన భర్తను క్షణికావేశంలో భార్య గొడ్డలితో నరికి చంపిన ఘటన అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేపంది. జిల్లాలోని ఉరవకొండ మండలం పెద్దమూష్టరులో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పెద్దమూష్టరుకు చెందిన ఓబులేసు నిత్యం మద్యం తాగి వచ్చి ఇంట్లో భార్య లలితమ్మతో గొడవ పడుతుండే వాడు. రోజు భర్త పెట్టే బాధను భరించలేని లలితమ్మ శనివారం డైల్ 100కు కాల్ చేసి తన సమస్యను చెప్పింది. వెంటనే పోలీసులు పెద్దమూష్టరు గ్రామానికి చెేరకొని భర్త ఓబులేసుకు కౌన్సెలింగ్ ఇచ్చారు. వారి ముందు ఇక ఎప్పడు తాగి భార్యతో గొడవ పడనని ఓబులేసు మాటిచ్చాడు.
కానీ, పూర్తిగా మద్యనికి బానిసైన ఓబులేసు ఎప్పటిలాగే ఆదివారం కూడా తాగి వచ్చి భార్య లలితమ్మను గొడ్డలితో చంపే ప్రయత్మం చేశాడు. ఆ దాడి నుంచి తప్పించుకున్న లలితమ్మ వెంటనే భర్త చేతిలోని గొడ్డలి లాక్కోని క్షణికావేశంలో భర్త ఓబులేసుపై దాడి చేసింది. రక్తపు మడుగులలో పడివున్న భర్తను అక్కడే వదిలేసి ఉరవకొండ పోలీసు స్టేషన్లో లొంగిపోయింది. అక్కడే రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఓబులేసును స్థానికులు హుటాహుటిన 108 వాహనంలో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ ఈరోజు సాయంత్రం ఓటులేసు కన్నుమూశారు. ఈ ఘటనపై ఉరవకొండ పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.