ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కల్వర్టును ఢీకొట్టిన ట్రావెల్స్​​ బస్సు - ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు - Two Persons Dead in Bus Accident - TWO PERSONS DEAD IN BUS ACCIDENT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 18, 2024, 12:39 PM IST

Travel Bus Crashed into the Divider: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పూడిచెర్ల వద్ద కల్వర్టును ప్రైవేటు బస్సు ఢీకొనడంతో డ్రైవర్‌తో పాటు మరో ప్రయాణికుడు మృతి చెందాడు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్ బస్సు ఉదయం 4 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తిరుపతికి చెందిన బస్సు డ్రైవర్ శ్రీనివాసులు, ప్రొద్దుటూరుకు చెందిన రాములు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున కావడంతో డ్రైవర్​ నిద్రమత్తులో కల్వర్టును ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు.

Two Persons Dead in Bus Accident: ప్రమాదాన్ని చూసిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కల్వర్టును ఢీకొని బస్సు అక్కడే నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అప్పటికి బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. కల్వర్టును ఢీకొన్న బస్సు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జైంది. హైవే సిబ్బంది బస్సును కల్వర్టు నుంచి బయటికి తీశారు. 

ABOUT THE AUTHOR

...view details