ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తెలంగాణకు రిలీవ్‌ చేయాలని ఆ రాష్ట్ర ఉద్యోగుల విజ్ఞప్తి - సీఎస్​కు లేఖ - Telangana Engineers Met CS Nirab

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 20, 2024, 12:12 PM IST

Telangana Engineers Association Met CS Nirab Kumar : విభజన తర్వాత రాష్ట్రంలో పని చేస్తోన్న తెలంగాణ ఉద్యోగులను రిలీవ్‌ చేయాలని కోరుతూ ఆ రాష్ట్ర ఇంజినీర్ల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 144 మంది ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్నారని, వారిని తమ రాష్ట్రానికి పంపాలని టీఎన్‌జీఓ సంఘం నేతలు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ను కలిసి విన్నవించారు. ఈ మేరకు సీఎస్‌కు విజ్ఞాపన పత్రాన్ని నేతలు అందజేశారు. బుధవారం అమరావతిలో ఏపీ సీఎస్‌ను మర్యాదపూర్వకంగా సంఘం సభ్యులు కలిశారు.  

గతంలో స్థానికత ఆధారంగా ఉద్యోగులను ప్రభుత్వం రిలీవ్‌ చేసింది. ఇప్పుడు తమను మాతృ రాష్ట్రానికి పంపించేందుకు వీలుగా నిర్ణయం తీసుకోవాలని ఇంజనీర్ల సంఘం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా ఉద్యోగుల రిలీవ్‌పై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని కోరినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌ గుర్తు చేశారు. ఏపీ సీఎస్‌ను కలిసిన వారిలో ప్రధాన కార్యదర్శి ముజీ హుస్సేన్, సహఅధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, ఎం.సత్య నారాయణగౌడ్, కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, హైదరాబాద్‌ నగర అధ్యక్షుడు కట్కూరి శ్రీకాంత్, ఉపాధ్యక్షలు నర్సింహారెడ్డి, కొండల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details