LIVE: సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటనపై టీడీపీ ఎంపీల మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - CHANDRABABU PRESS MEET LIVE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 15, 2024, 8:18 PM IST
|Updated : Nov 15, 2024, 8:24 PM IST
Chief Minister Chandrababu Naidu press meet Live : ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈరోజు (శుక్రవారం) సాయంత్రం విజయవాడ నుంచి దిల్లీ చేరుకున్న చంద్రబాబు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాజధాని అమరావతికి ప్రపంచబ్యాంకు, ఏడీబీ ఇస్తున్న రూ.15వేల కోట్ల రుణం తదితర అంశాలపై ఆర్థిక మంత్రితో చంద్రబాబు చర్చించినట్టు సమాచారం. నిర్మలా సీతారామన్‌తో భేటీ ముగిసిన తర్వాత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌తో సీఎం సమావేశమయ్యారు. శనివారం ఆంగ్ల పత్రిక హిందుస్థాన్ టైమ్స్ నిర్వహిస్తున్న లీడర్‌షిప్ సమ్మిట్‌లో సీఎం పాల్గొననున్నారు. కార్యక్రమం అనంతరం దిల్లీ పర్యటన ముగించుకుని మధ్యాహ్నం మహారాష్ట్రకు వెళ్లనున్నారు. మహారాష్ట్రలో రెండు రోజులపాటు ఎన్‌డీఏ తరపున ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. శనివారం అసెంబ్లీ సమావేశాలకు ఇద్దరు ముఖ్య నేతలు అందుబాటులో ఉండరు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో తెలుగువారు ఎక్కువగానే నివాసం ఉండే ప్రాంతాల్లో ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Nov 15, 2024, 8:24 PM IST