ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇంటర్నేషనల్‌ డాన్‌గా మారారు: గండి బాబ్జి - TDP Gandi Babji on drugs Case - TDP GANDI BABJI ON DRUGS CASE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 5:16 PM IST

TDP Leader Gandi Babji Fires on YS Jagan: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఓ ఇంటర్నేషనల్‌ డాన్‌ అని టీడీపీ నేత గండి బాబ్జి ఆరోపించారు. సీఎం జగన్ ఇతర దేశాలను మేనేజ్ చేసి మాదక ద్రవ్యాల కంటైనర్ తెప్పించారని, ప్రజలకు కావలసిన ఔషధాలు అని చెప్పి విదేశాల నుంచి డ్రగ్స్​ కంటైనర్లను అంతర్జాతీయ సరిహద్దులు దాటిస్తున్నారని ఆరోపించారు. 

జగన్ పేద దేశాలకు డబ్బులు ఏర చూపి తప్పుడు పనులకు వాడుకుంటున్నారని అన్నారు. సీబీఐ విచారణ అయితే జరుగుతోందని, ఈ డ్రగ్స్ కేసుని కూడా వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి తరహాలాగే నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం మరో బిహార్‌గా మారడం ఖాయమని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మద్యం నియంత్రణ జరుగుతుందని, అన్నా క్యాంటీన్లు పెడతామన్నారు. చంద్రబాబు హయాంలో రైతుల సమ్మతితో 33 వేల ఏకరాలను తీసుకుని రాజధాని నిర్మాణం తలపెట్టారని, జగన్ హయాంలో మూడు రాజధానులు అని చెప్పి ఒక్క భవనం కూడా కట్టలేదన్నారు. టీడీపీ హయాంలో పోలవరం 72 శాతం పూర్తయిన ప్రోజెక్టును అయిదేళ్లుగా అటకెక్కించేశారని మండిపడ్డారు. నిరుద్యోగులు ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ లేకుండా చేశారని ఆవేదన చెందారు. 

ABOUT THE AUTHOR

...view details