ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మంత్రివర్గ కూర్పు భేష్- అవినీతికి సహకరించిన అధికారులను వదలొద్దు: టీడీపీ నేత అయ్యన్న - TDP leader Ayyanna Patrudu - TDP LEADER AYYANNA PATRUDU

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 13, 2024, 9:45 PM IST

TDP leader Ayyanna Patrudu: మంత్రి పదవులు రాలేదన్న ఇబ్బంది టీడీపీలోని సీనియర్ నేతలకు ఎవరికీ లేదని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. తనతో సహా చాలా మంది గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా కేసులతో ఇబ్బందులు పడ్డామన్నారు. ఐదు కీలకమైన అంశాలపై సంతకం చేసి చంద్రబాబు తన పాలనను మొదలు పెట్టేశారని అన్నారు. గతంలో సైతం అనేక మంది ముఖ్యమంత్రులను చూశామని, చంద్రబాబులా మాటమీద నిలబడిన వ్యక్తి ఇంతవరకూ చూడలేదని తెలిపారు. పాస్ పుస్తకాలపై మాజీ సీఎం జగన్ ఫోటోలు తీసే ప్రయత్నం చేయలని చంద్రబాబుకు సూచించినట్లు తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అవినీతి పరులు, వారికి వంతపాడిన పోలీసులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భారీ మెుత్తంలో మెజార్టీ వచ్చిన నేపథ్యంలో మంత్రుల కేటాయింపులో ఇబ్బందులు  లేవని  పేర్కొన్నారు. మంత్రి మండలి కూర్పును పూర్తిగా స్వాగతిస్తున్నట్లు అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. యువకులకు అవకాశాలు ఇవ్వాలని అందువల్లే మంత్రివర్గ కూర్పులో వారికి పెద్దపీట వేశారని పేర్కొన్నారు.  

ABOUT THE AUTHOR

...view details