సీఎం జగన్ ప్లకార్డులు నేలకేసి కొట్టిన విద్యార్థులు, ఎందుకంటే? - ప్లకార్డులు నేలపై పడేసి నిరసన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 13, 2024, 1:42 PM IST
Sudents Torn and Thrown Down CM Flags in Satyasai District : సత్యసాయి జిల్లా ధర్మవరంలో విద్యార్థులతో వైఎస్సార్సీపీ నేతలు చేపట్టిన ర్యాలీ, సదస్సులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ నగర్‌లోని ఓ కళ్యాణ మండపంలో జగనన్నకు కృతజ్ఞత సభ నిర్వహించారు. MLA కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సభలో మాట్లాడారు.
రెండు గంటల పాటు ర్యాలీ, సభ నిర్వహన అనంతరం విద్యార్థులు సభా వేదిక వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెను తిరిగిన వెంటనే విద్యార్థులంతా ఆగ్రహంతో సీఎం జగన్ (CM Jagan), ఎమ్మెల్యే కేతిరెడ్డి (MLA Kethireddy) ఉన్న ఫ్లకార్డులను చించివేసి కింద పడేశారు. పలువురు విద్యార్థినులు అంతవరకు చేతుల్లో ఉన్న, మోసిన ప్లకార్డులు నేలపై పడేసి నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వం పై విద్యార్థులు నిరసన తెలిపారు. విద్యార్థుల తీరు స్థానికంగా కలకలం రేపుతోంది.