ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE : ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు - ప్రత్యక్షప్రసారం - TELUGU WRITERS CONFERENCE LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2024, 10:22 AM IST

Updated : Dec 28, 2024, 12:17 PM IST

6th Telugu Writers Conference LIVE : మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా ఆరో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో శనివారం ఆరంభమయ్యాయి. రెండు రోజులపాటు జరిగే ఈ సభల్లో దేశవిదేశాల నుంచి 1500 మందికి పైగా ప్రతినిధులు పాల్గొననున్నారు. KBN కళాశాల ప్రాంగణంలో జరిగే ఈ సభల కోసం సర్వం సిద్ధమైంది. రెండు రోజుల్లో 25కు పైగా సదస్సులు, కవితా, సాహిత్య సమ్మేళనాలు నిర్వహించనున్నారు. తెలుగు భాషను భవిష్యత్ తరాలకు మరింత చేరువ చేయడానికి ఏం మార్పులు తేవాలనే లక్ష్యంతో మహాసభల్లో ప్రధానంగా చర్చ జరగబోతోంది.'రేపటి తరం కోసం ఇప్పటి మనం ఏ మార్పు కోరుతున్నాం?' అనేది ప్రధాన అంశంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. యువ రచయితలు 170మందితో ‘యువ కలాల సమ్మేళనం’నిర్వహిస్తున్నారు. అలాగే 800 మందికి పైగా భాషాభిమానులకు వేదికలపై పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. రాజకీయ, న్యాయ, పరిపాలనలో తెలుగు ప్రాధాన్యం పెంచే దిశగా సదస్సులు నిర్వహిస్తారు. పత్రికలు, ప్రచురణ సంస్థల్లో మాతృభాష ప్రాధాన్యంపైనా సదస్సులు జరుగుతాయి. సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ మహాసభలను ప్రారంభిస్తారు. శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే సుజనాచౌదరి, మార్గదర్శి మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజా కిరణ్‌ తదితరులు అతిథులుగా పాల్గొంటారు.ప్రస్తుతం ఆరో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరుగుతున్నాయి. ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Dec 28, 2024, 12:17 PM IST

ABOUT THE AUTHOR

...view details