ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మంగళగిరిలో ఆరో బెటాలియన్‌ పోలీసుల ఆందోళన - ఓటు హక్కు కల్పించాలని డిమాండ్‌ - Battalion polices demanded to vote - BATTALION POLICES DEMANDED TO VOTE

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 7:22 PM IST

Sixth Battalion Police Demanded to Right to Vote in Mangalagiri : గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆరో బెటాలియన్‌ పోలీసులు ఆందోళన చేపట్టారు. తమకు ఓటు హక్కు కల్పించాలంటూ మంగళగిరి ఆర్వో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈనెల 7, 8, 9 తేదీల్లో జరిగిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్​లో మంగళగిరి బెటాలియన్​కు చెందిన సుమారు 140 మంది పోలీసులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి అప్పటికే మహారాష్ట్రలో ఎన్నికల విధులు కేటాయించారు. విధుల్లో ఉన్నందున తాము ఓటు హక్కు వినియోగించుకోలేదని తమకు మళ్లీ ఓటు వేసే అవకాశం కల్పించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆరో బెటాలియన్‌ పోలీసులు విన్నవించుకున్నారు. దీంతో ఈనెల 13న వచ్చి ఓటు వేయాలని పోలీసులకు ఎన్నికల అధికారులు సమాచారం ఇచ్చారు. ఈరోజు మహారాష్ట్ర నుంచి వచ్చిన పోలీసులు ఓటు వేసేందుకు పోలింగ్ బూత్​లోకి వెళ్లగా మీకు ఇక్కడ ఓటు హక్కు లేదని అధికారులు వారిని తిప్పి పంపించారు. 

ఓటర్ల జాబితాలో వారి ఫోటో పక్కన పోస్టల్ బ్యాలెట్ అని రాసి ఉండటంతో వారికి అధికారులు ఓటు హక్కును నిరాకరించారు. దీంతో సుమారు 30 మంది పోలీసులు మంగళగిరి ఆర్వో కార్యాలయానికి చేరుకుని వాగ్వాదానికి దిగారు. అంతలో అక్కడికి చేరుకున్న లా అండ్ ఆర్డర్ పోలీసులు, బెటాలియన్‌ పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి రాష్ట్ర ఎన్నికల అధికారిని కలవాలని సిబ్బంది చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ABOUT THE AUTHOR

...view details