ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎన్నికల ప్రచారంలో అవంతి శ్రీనివాస్‌కు నిరసన సెగ - ప్రశ్నించిన వారిపై వాగ్వాదం - Protest to MLA Avanthi Srinivas - PROTEST TO MLA AVANTHI SRINIVAS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 23, 2024, 10:15 PM IST

Protest to YSRCP MLA Avanthi Srinivas : మే 13 న పోలింగ్ తేదీ కావడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారానికి ప్రజల్లోకి పయనమయ్యారు. కానీ వారికి సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. గతంలో ఓ సారి ఓటు అడగడానికి వచ్చారని ఐదేళ్ల తర్వాత మరలా ఓటు 'అడుక్కోడానికే' వచ్చారని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. 2019లో గెలిచిన తర్వాత తమ మోహం చూసిన పాపాన పోలేదని, సమస్యల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారని నిప్పులు చెరిగారు. రెండు రోజుల క్రితం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి నిరసన సెగ ఎదురైంది. తాజాగా అవంతి శ్రీనివాస్‌కు కూడా అదే పరిస్థితి ఎదురైంది.

YSRCP MLA Avanthi Srinivas Election Campaign : విశాఖ జిల్లా పద్మనాభం మండలం బాంధేపురంలో ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఆయన ప్రచార వాహనం నుంచి ప్రసంగం మొదలు పెట్టగానే నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన అవంతిని సమస్యలపై ప్రజలు నిలదీశారు. ఓట్లకు కోసం వస్తున్నారు గానీ సమస్యలపై అధికారులకు పలు మార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని మహిళలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో మూడు కుళాయిలు విరిగిపోయి ఉన్నాయని సెక్రటరీకి చెప్పినా ఇప్పటి వరకు సమస్య పరిష్కరించలేదని ఓ మహిళ నిప్పులు చెరిగింది. ఇవాళే వస్తారు రేపు కనిపించరంటూ ఎద్దేవా చేశారు. అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతుండగా తమ ఆస్తి పోయిందంటూ ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. దీంతో సమస్యలకు సమాధానం ఇవ్వాలంటూ ఎంపీపీ రాంబాబుకు మైకు అందజేసి అవంతి మిన్నకుండి పోయారు. సమస్యలను విన్నవించుకుంటున్న స్థానిక ప్రజలపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు, శ్రేణులు వాగ్వాదానికి దిగారు.

ABOUT THE AUTHOR

...view details