ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE : మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవం- హాజరైన ద్రౌపదీ ముర్ము - ప్రత్యక్ష ప్రసారం - MURMU IN MANGALAGIRI AIIMS LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Mangalagiri AIIMS Convocation Live : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవ వేడకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు డిగ్రీలు, పోస్ట్‌ డాక్టోరల్‌ సర్టిఫికెట్‌ కోర్సు పూర్తి చేసిన నలుగురు విద్యార్థులకు ఆమె బంగారు పతకాలు అందజేస్తున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఎయిమ్స్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్‌ రావ్‌ గణపత్‌రావ్‌ జాదవ్, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్‌ యాదవ్, నారా లోకేశ్‌ గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఇక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న వారిలో ఇప్పటి వరకు ఏపీ విద్యార్థులే అధికంగా ఉన్నారు. 2018-24 మధ్య ఎంబీబీఎస్‌ విద్యార్థులు 725 మంది చేరగా వారిలో సుమారు సగంమంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే ఉండడం గమనార్హం. మొత్తం విద్యార్థుల్లో అబ్బాయిలు 392, అమ్మాయిలు 333 మంది.

ABOUT THE AUTHOR

...view details