ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: స్వాతంత్య్ర వేడుకలు - ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ - ప్రత్యక్షప్రసారం - PM Modi in Red Fort - PM MODI IN RED FORT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 15, 2024, 7:08 AM IST

Updated : Aug 15, 2024, 9:39 AM IST

PM Modi in Red Fort Live : దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే దిల్లీలోని ఎర్రకోటలో జరిగే పంద్రాగస్టు వేడుకలను నిర్వహిస్తున్నారు. 2047 వికసిత భారత్‌ థీమ్‌తో పంద్రాగస్టు వేడుకలు నిర్వహిస్తున్నారు. వేడుకులకు దాదాపు 6 వేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు.అతిథుల్లో రైతులు, యువత, మహిళలతో సహా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. అదేవిధంగా పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్న 117 మంది అథ్లెట్లు వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ ఉత్సవాల్లో ప్రజా భాగస్వామాన్ని పెంచాలనేది లక్ష్యమన్న కేంద్రం పేర్కొంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీసుల పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఎర్రకోటలో ఏర్పాటు చేసిన పంద్రాగస్టు వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. వరుసగా 11వ సారి ప్రధానిగా మోదీ జెండా ఎగురవేశారు. అంతకుముందు ప్రధానికి రక్షణ మంత్రి నేతృత్వంలోని బృందం స్వాగతం పలికింది. రక్షణ దళాలు ఇచ్చే గౌరవ వందనాన్ని మోదీ స్వీకరించారు. గౌరవ వందనం తర్వాత ప్రధాని త్రివర్ణ పతకాన్ని ఎగుర వేశారు. త్రివర్ణ పతకాన్ని ఎగురవేస్తున్న సమయంలో హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. ఎర్రకోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ప్రత్యక్ష ప్రసారం. 
Last Updated : Aug 15, 2024, 9:39 AM IST

ABOUT THE AUTHOR

...view details