ప్రవాసాంద్రులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి: కేంద్ర మంత్రి పెమ్మసాని - Pemmasani On IT Sector - PEMMASANI ON IT SECTOR
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 11, 2024, 3:31 PM IST
Pemmasani Chandrasekhar Inaugurated IT Training Center in Guntur : అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసాంద్రులు తిరిగి వచ్చి రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ (Union Minister Dr. Pemmasani Chandrasekhar) అన్నారు. గుంటూరులో ఫాంగ్ టెక్ ల్యాబ్ ఐటీ ట్రైనింగ్ సెంటర్‌ను (Fang Tech Lab IT Training Centre) పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. సంస్థ నిర్వాహకులు జాగర్లమూడి వెంకట్ ట్రైనింగ్ సెంటర్ వివరాలను పెమ్మసానికి వివరించారు. అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ అమెరికాకు వెళ్లాలనుకునే విద్యార్థిని, విద్యార్థులకు ఐటీ రంగంలో మరింత నైపుణ్యతతో కూడిన కోచింగ్‌ను అందించడం కోసం కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడాన్ని అభినందించారు. సరైన గైడెన్స్ లేక అమెరికా వెళ్లిన విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి కంపెనీలలో ట్రైనింగ్ తీసుకుని వెళ్తే అమెరికాలో ఇబ్బందులు పడాల్సిన అవసరం రాదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.