ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ధ్రువపత్రాలు ఇవ్వలేదని ఔట్‌సోర్సింగ్​ ఉద్యోగిపై కత్తితో దాడి - Assaulted Contract Worker

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 31, 2024, 10:40 PM IST

One Person Attack to Assaulted Contract Worker (ETV Bharat)

One Person Attack to Assaulted Contract Worker : కృష్ణా జిల్లా కంకిపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు అనే వ్యక్తిని గంగూరుకు చెందిన రెహమాన్ అనే వ్యక్తి దాడి చేశాడు. మూడు నెలల క్రితం నకలు పత్రాలు కోసం రెహమాన్‌ కార్యాలయానికి వచ్చాడు. అయితే ఆ నకలు తాను ఇప్పిస్తానని శ్రీనివాసరావు చెప్పడంతో విడతల వారిగా సుమారు 70 వేల రూపాయలను ఇచ్చాడు. నకలు కోసం కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా స్పందించకపోవడంతో రెహమాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన రెహమాన్‌ తనతో పాటు తెచ్చుకున్న కత్తితో శ్రీనివాసరావుపై దాడి చేశాడు. అప్రమత్తమైన స్థానికులు బాధితుడిని పోరింకిలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు రిజిస్ట్రార్ త్రినాథ్‌ను వివరణ అడిగితే సీసీ కెమరాలు పనిచేయడం లేదని శ్రీనివాసరావు మామూలుగా క్యారేజీలు తీసుకొస్తారని సమాధానం ఇచ్చారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details