ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఏపీలో కాంగ్రెస్​కు స్థానం లేదు - షర్మిల రాకతో ఆ గ్రాఫ్ ఇంకా పడిపోయింది: పెద్దిరెడ్డి - Sharmila

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 2, 2024, 6:14 PM IST

Minister Peddireddy Ramachandra Reddy Criticized Congress Party : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఇంకా పడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు షర్మిలను రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారని ఆరోపించారు.  

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మడకశిర నియోజకవర్గ పరిశీలకుడు పోకల అశోక్ కుమార్, నియోజకవర్గ వైసీపీ ఇన్​ఛార్జ్​ ఈర లక్కప్ప, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి శాంత, నాయకులు పాల్గొన్నారు. స్థానిక దళిత ఎమ్మెల్యే తిప్పేస్వామి కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేను ఉద్దేశపూర్వకంగానే ఆహ్వానించలేదని నియోజకవర్గంలో గుసగుసలు వినిపించాయి. మరోపక్క నియోజకవర్గంలో మంత్రి పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తారనే నెపంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి పలువురు టీడీపీ నాయకులకు ముందస్తుగా నోటీసులు అందించారు. 

ABOUT THE AUTHOR

...view details